ఆమ్మో.. కార్తీకదీపంలోకి ఎంట్రీ ఇస్తున్న పెద్ద విలన్ మోనిత.. ఆ న్యూస్ చెప్పిన బ్యూటీ?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తిక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలు అక్కతో పాటుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మరొక క్యారెక్టర్ మోనిత.

 Shobha Shetty Aka Monitha Confirmed That She Will Be Soon Seen In Karthika Deepa-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు,వంటలక్క,మోనితలు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ రేటింగ్ సీరియల్ గా చరిత్రకి ఎక్కిన ఈ సీరియల్ లో కార్తీక్,దీప లను చంపేసి నెక్స్ట్ జనరేషన్ కథతో కార్తీకదీపం రూపు రేఖలు మొత్తం మార్చేశారు.అప్పుడు దీప, కార్తీక్, మోనితలపై నడిపించిన కథను, ప్రస్తుతం సౌర్య వర్సెస్ హిమల మధ్య కీలక కథాంశంతో అక్కచెల్లెల్ల మధ్య పోరుగా మార్చేశారు.

దీనితో ఒకప్పుడు టాప్ రేటింగ్ కొల్లగొట్టిన ఈ సీరియల్ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది.

కాగా మళ్ళీ నెంబర్ 1 స్థానం దక్కించుకోవడం కోసం ఈ సీరియల్ ట్టిపోటీని ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలోనే సీరియల్ మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్ బాబు, మోనిత, వంటలక్క లు ఇవ్వాలి.అయితే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలోని చంపేశారు కాబట్టి మోనిత క్యారెక్టర్ మాత్రమే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే డాక్టర్ బాబు, వంటలక్క మళ్లీ బతికి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఎందుకంటే ఇప్పటికే అలా సీరియల్ లో చంపేసిన వారిని మళ్లీ తిరిగి రావడం అన్నది చాలా సందర్భాలలో చాలా సీరియల్స్ జరిగాయి.

కానీ ఈ సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబులను తిరిగి బతికించి తీసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి మోనిత రీ ఎంట్రీ ఇచ్చే స్కోప్ చాలా ఉంది.మోనిత ఎంట్రీతో కార్తీకదీపం సీరియల్ రేటింగ్‌లో పుంజుకోవడమే కాకుండా మళ్ళీ పూర్వ వైభవం అందుకునే అవకాశం కూడా లేకపోలేదు.

Telugu Babu, Karthika Deepam, Monitha, Shobha Shetty, Vantalakka-Movie

అయితే మోనిత తిరిగి కార్తీకదీపం సీరియల్ లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ తో పాటు మోనిత కూడా ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్‌లో ఉన్నట్టు స్పష్ఠత ఇచ్చేసింది.ఇటీవల ఆమె యూట్యూబ్ ఛానల్‌లో కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది అందులో తాను కార్తీకదీపంలోకి రాబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది.మోనిత మాట్లాడుతూ.రెగ్యులర్‌గా నా ఫ్యాన్స్ అంతా నాకు కామెంట్లు పెడుతూనే ఉన్నారు.మళ్లీ కార్తీకదీపంలోకి ఎప్పుడు వస్తారు అడుగుతూనే ఉన్నారు.నాకు కూడా మళ్లీ కార్తీకదీపం సీరియల్‌లోకి రావడానికి చాలా ఆశగా ఉంది.

కానీ రావాలా? వద్దా? అన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నాం.త్వరలోనే దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను మోనిత.

అయితే మోనిత సీరియల్‌లోకి రావాలంటే ఖచ్చితంగా జుట్టుకి తెలుపు రంగు పూసుకోవాల్సిందే.తన వయసుకి తగ్గ పాత్ర కాకుండా అమ్మ పాత్రను పోషించాల్సింది.

ఈ సీరియల్‌కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఒకే చెప్పినా ఆ తరువాత ఈ తరహా పాత్రలే వచ్చే అవకాశం ఉండటంతో ఈ సీరియల్ లో యంగ్ మోనితగా వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తుందట మోనిత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube