'నా పిల్లి మొరటుది' కాదంటూ కేసు.. కళ్లు తిరిగేంత పరిహారం!

అమెరికాలో పెంపుడు పిల్లి కోసం పోరాడిన దాని యజమాని ఎట్టకేలకు కేసులు విజయం సాధించి రూ.95 లక్షలు పొందనున్నాడు.

వినడానికి ఇది వింతగా అనిపించినప్పటికీ.

ఈ ఉదంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది.అమెరికాకు చెందిన అన్నా డానియెలీ అనే మహిళ పిల్లిని పెంచుకుంటోంది.

ఆ పిల్లి పేరు మిస్కా. 3 సంవత్సరాల క్రితం వివిధ సంఘటనల కారణంగా మిస్కాపై 30 కేసులు నమోదయ్యాయి.అలాగే దానిపై జరిమానాలు, నియమాల ఉల్లంఘన ఛార్జీలు విధించారు.

మొత్తం మీద పిల్లి దురుసుగా ప్రవర్తించిందనే ఫిర్యాదుతో దాని యజమానికి 23 లక్షల జరిమానా విధించారు.అన్నా పెంపుడు పిల్లిని యానిమల్ కంట్రోల్ ఆఫీస్ యాజమాన్యం స్వాధీనం చేసుకుంది.

Advertisement

ఈ కేసు 2019 నాటిది.అన్నా డానియెలీ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.

జంతు నియంత్రణ కార్యాలయానికి చెందిన పలువురు అధికారులు అన్నా ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్నారు.వారు పిల్లి ప్రవర్తన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్కా ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఇతర జంతువులను చంపేస్తోందని వారు ఫిర్యాదు చేశారు.మిర్రర్ నివేదిక ప్రకారం అన్నా తన పిల్లిపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లడం సరైనదని భావించింది.

న్యాయవాది సహాయంతో ఆమె కేసు దాఖలు చేసింది.ఈ కేసు 3 మూడేళ్ల పాటు నడిచింది.ఇటీవలే ఈ కేసులో తీర్పును వెలువడింది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

పెంపుడు పిల్లి ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్య సృష్టించలేదని కోర్టు నిర్థారించింది.పిల్లి నిర్దోషిగా పరిగణించిన కోర్టు అన్నాకు £ 1,00,000 అంటే భారతీయ కరెన్సీలో మొత్తం 95 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని తీర్మానించింది.

Advertisement

ఇది చారిత్రాత్మక నిర్ణయమని, వాషింగ్టన్‌లో పెంపుడు పిల్లి హక్కులను తొలిసారిగా పరిరక్షించామని అన్నా తరఫు న్యాయవాది తెలిపారు.

తాజా వార్తలు