జీడిపప్పు వలన కలిగే లాభాలు ఇవన్ని

జీడిపప్పు అంటే మనందరికి ఇష్టమే.ఏదైనా వంటకంలో జీడిపప్పు వేసినప్పుడు, జీడిపప్పు వెతుక్కోని మరి తినడం చిన్నప్పుడు మనందరం చేసిన పనే.

ఈ జీడిపప్పుని ఊరికే దేంట్లోనూ వేయకుండా తిన్నా రుచికరంగా ఉంటాయి.జీడిపప్పు బ్రెజిల్ నుంచి మన దేశానకి వచ్చింది.

అక్కడినుంచి కొందరు వర్తకులు వస్తూ వస్తూ .జీడిపప్పుని తీసుకొచ్చారు.సరే, కాసేపు హిస్టరి వదిలేసి సైన్స్ లోకి వెళ్ళి జీడిపప్పు వలన శరీరానికి కలిగే లాభాలేంటో చూద్దాం.

* నేషనల్ సెంటర్ ఫర్ బయేటెక్నాలజీ ఇంఫర్మేషన్ (NCBI) చేసిన ఒక అధ్యయనం ప్రకారం, జీడిపప్పు గుండె యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది.ఇది కొలెస్టరాల్ తగ్గించండంలో సహాయపడుతుంది.

Advertisement

* జీడిపప్పులో కాపర్ బాగా దొరుకుతుంది.ఈ లక్షణం వల్లే రక్తంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని తీసివేస్తుంది జీడిపప్పు.

దాంతో రక్త సంబంధింత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గిపోతుంది.కాబట్టి జీడిపప్పు రోజు తినే అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

* జీడిపప్పు నూనెలో ఐరన్, ఫాస్ ఫరస్, జింక్, మెగ్నీషియం, సెలెనియం దొరుకుతాయి.ఇందులో ఉండే సెలెనియం చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఇది క్యాన్సర్ ని కూడా అడ్డుకుంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.* జీడిపప్పులో ఉండే ఒకరకమైన యాంటిఆక్సిడెంట్ UV Rays నుండి కళ్ళను కాపాడే శక్తిని కలిగి ఉంటుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

కంటిఆరోగ్యానికి ఈరకంగా పనికివస్తుంది జీడిపప్పు.* జీర్ణక్రియకు జీడిపప్పు గొప్ప నేస్తం లాంటిది.

Advertisement

ఇందులో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాయి.* జీడిపప్పు నూనె కురుల ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

* మెటబాలిజంను మెరుగుపరిచే ఒమేగా 3 ఫాట్టి ఆసిడ్స్ జీడిపప్పులో లభిస్తాయి.కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్ లో జీడిపప్పుని చేర్చుకోవాలి.

తాజా వార్తలు