వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మీద కేసు నమోదయ్యింది.కొద్ది రోజుల క్రితం కరీంనగర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్లాగొన్న ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టినట్టుగా ఆయనపై నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కేసు నమోదైంది.
అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీంతో స్పందించిన నాంపల్లి కోర్టు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలంటూ సైదాబాద్ పోలీసులను గురువారం ఆదేశించింది.
ఈ మేరకు అక్బరుద్దీన్‌పై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 153బీ,506 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఆయనపై శుక్రవారం కేసు నమోదు చేశారు.
సీఆర్పీసీ కింద విచారణ జరిపి డిసెంబర్ 23న జరిగే తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.