టోల్ గేట్ ను వేగంగా వచ్చి ఢీకొన్న కారు గాల్లోకి ఎగిరి పడ్డ డ్రైవర్... వీడియో వైరల్..

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.దీనికి గల కారణం వాహనాలను వేగంగా నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం ఇలాంటివి చేస్తున్నారు.

 Car Collided With Toll Booth Video Viral Details, Car Collided With Toll Booth ,-TeluguStop.com

అందుకే రోడ్లపై వెళ్లేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.నడుచుకుంటూ వెళ్లినా, ఏదైనా వాహనంపై వెళ్లినా ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ను, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టును కచ్చితంగా ఉపయోగించాలి.ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు.

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.

ఇలా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఆ ప్రమాదాలు చాలావరకు ప్రాణాంతకంగా మారుతున్నాయి.కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా సురక్షితంగా బయటపడతారు.

ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇలాంటి వీడియోను మీరు చూస్తే కచ్చితంగా భయంతో వణికిపోతారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కారు వేగంగా వచ్చి టోల్ గేట్ వద్ద ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారు గాల్లోకి ఎగిరి క్రిందపడింది.అదే సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ కూడా చాలా వేగంగా కారు అద్దాలు పగలగొట్టుకుని గాల్లోకి ఎగిరి వేగంగా కింద పడిపోయాడు.టోల్ బూత్ డివైడర్‌ను కారు వేగంగా ఢీకొట్టడం, కారులో మంటలు రావడం, కారు డ్రైవర్ పైకి ఎగిరి క్రింద పడిపోవడం లాంటి విషయాలన్నీ రెప్పపాటు కాలంలో జరిగాయి.ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడా లేక చనిపోయాడా అనేది కచ్చితంగా తెలియదు.

ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube