స్టార్ హీరో అయినా కూడా సినిమా తృప్తిని ఇవ్వలేదు. కానీ ?

తెలుగులో ఎన్టీఆర్, అలాగే తమిళంలో ఎం జి ఆర్, కర్ణాటకలోకొచ్చేసరికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్… వీరంతా వారి వారి భాషల్లో అగ్ర హీరోలుగా ఒక వెలుగు వెలిగారు.వారి భావితరాలకు వారొక ఉదాహరణగా నిలిచారు.

 Shiva Rajkumar Not Happy With Movies , Kanthirava Rajkumar , Shiva Rajkumar,-TeluguStop.com

కష్టం, పట్టుదల, శ్రమ, క్రమశిక్షణతో కూడిన నటన ఇవన్నీ కూడా వారికి ఉన్న సద్గుణాలు.వారి తరం తర్వాత తరతరాలు గుర్తుంచుకునే సినిమాలు కూడా తీశారు.

తెలుగు తమిళ కన్నడ భాషలన్నీ కూడా అప్పట్లో మద్రాస్ లోనే ఉండేవి.కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తన ఇద్దరు కొడుకులను కూడా హీరోలుగా చేశారు.

ముఖ్యంగా శివరాజ్ కుమార్ గురించి చెప్పాలి.రాజ్ కుమార్ కి పెద్ద కొడుకు శివరాజ్ కుమార్.

మద్రాస్ లో ఓ రోజు దర్శకుడు బాల చందర్ గారి దగ్గరికి రాజ్ కుమార్ శివకుమార్ ను తీసుకొని వెళ్లగా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేర్పించండి గొప్ప హీరో అవుతాడని చెప్పాడట.బాలచందర్ గారు ఆలా అన్నారంటే వారు ఖచ్చితంగా మంచి హీరో అవ్వాల్సిందే.

ఆ తర్వాత ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి డ్యాన్స్ నేర్పించిన వెంపటి చిన సత్యం దగ్గర నాట్యం నేర్చుకున్నాడు.తండ్రి చెప్పినట్టుగానే ఆరోజు నుండి సినిమా పరిశ్రమంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

కానీ ఇక్కడ విశేషమేమిటంటే శివకుమార్ నటించిన మొదటి మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.తండ్రి వారసత్వం నుంచి ఎదిగాడు అన్న బ్రాండ్ కూడా తొలగించుకున్నాడు.

ఆ తర్వాత శివరాజ్ కుమార్ నటించిన ఒక కన్నడ సినిమా ఆ సినిమా పరిశ్రమ రూపు రేఖల్ని మార్చేసింది.ఆ చిత్రానికి దర్శకుడు ఉపేంద్ర./br>

Telugu Balachandar, Chennai, Kannda, Kollywood, Om, Sathyam, Shiva Raj Kumar, Sh

అయన తీసిన ఓం సినిమా 1995లో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత పదేళ్లపాటు శివకుమార్ కి మరో హిట్టు లేకుండా చేసింది అంటే ఆ సినిమా ఎఫెక్ట్ శివ రాజ్ కుమార్ పైన ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆ సినిమా తెలుగులో కూడా రాజశేఖర్ హీరోగా రీమేక్ అయింది.శివరాజ్ కుమార్ ఈ సినిమా తర్వాత ఎందరికో ఆరాధ్య హీరో అయ్యాడు.ఆ తర్వాత మళ్లీ ఓంకారం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.అలా శివన్నకు హిట్టు పైన హిట్టు పడిన ఏదో తెలియని అసంతృప్తి.ఇక ఆ తర్వాత జోగి అనే సినిమా తీశాడు.

కర్ణాటకలో జోగి సినిమా 35 కోట్లు కలెక్ట్ చేసింది ఇది 2005లో జరిగింది.అదే సినిమా ప్రభాస్ యోగి పేరుతో వచ్చిదని.

Telugu Balachandar, Chennai, Kannda, Kollywood, Om, Sathyam, Shiva Raj Kumar, Sh

కన్నడిగులు శివన్న ని గుండెల్లో పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం అయన చేసిన సేవా కార్యక్రమాలు.సినిమా శివన్న కి సంతృప్తిని ఇవ్వలేదు.సేవ చేయడమే అతనికి ఎంతో తృప్తినిచ్చింది తన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ కి కూడా సేవా గుణం గురించి బీజం వేసింది శివన్ననే.శివన్న వ్యక్తిత్వం ఆకాశాన్ని తాకేంత గొప్పది.

సోషల్ మీడియాలో ఎక్కువగా అందుబాటులో ఉంటాడు శివన్న అతని చేసే గుప్త దారాల గురించి సేవా కార్యక్రమాల గురించి బయటకు చెప్పకపోయినా అతని గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటుంది పరిశ్రమ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube