కమ్యూనిస్టులతో కాంగ్రెస్( Congress ) పొత్తు చర్చలు ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది.సిపిఐ( CPI ) తో సీట్ల సర్దుబాటు అనుకున్నట్టుగా జరిగినా సిపిఎంతో మాత్రం పొత్తు చర్చలు ఫెయిల్ అయినట్లుగా తెలుస్తుంది.
ఆ మేరకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram ) వచ్చే ఎన్నికల్లో 17 స్థానాలలో సిపియం పోటి చేస్తున్నట్లుగా ప్రకటించారు.పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించలేదని, తమకు కనీస మర్యాద ఇవ్వకుండా వ్యవహరించిందని, తొలుత భద్రాచలం, పాలేరు, వైరా సీట్లు ఇస్తామని ప్రతిపాదించారని ఆ తర్వాత రెండు సీట్లకు పరిమితం చేశారని చివరకు మిర్యాలగూడ , వైరా ఇస్తామన్నారని కానీ ఇప్పుడు దానికి కూడా కాంగ్రెస్ అభ్యంతరం చెబుతుందని మిర్యాలగూడ మరియు హైదరాబాదులో ఒక సీటు ఇస్తామంటూ ఇప్పుడు మాట మారుస్తుందని ఇది పొత్తులను డీల్ చేసే పద్ధతి కాదని, రెండు చేతులూ ఉంటేనే చప్పట్లు అవుతాయని, తాము ఎన్ని మెట్లు దిగినా కాంగ్రెస్ మాత్రం తమను అడుగడుగునా అవమానిస్తుందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాము 17 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు .బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యమని, తమ అభ్యర్థులు లేని చోట్ల అక్కడ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలంగాణలో భాజపా ఒక సీటు కూడా గెలవకూడదు అన్నదే లక్ష్యంగా పనిచేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు.తాము పొత్తు లో నుంచి తప్పుకోవటంతో సిపిఐ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.మల్లు, బట్టి విక్రమార్క( batti vikramarka ) ఇచ్చిన హామీతో ఇప్పటి వరకూ ఎదురు చూసామని, అయితే ఎమ్మెల్సీలు ఇస్తామని, మంత్రులు చేస్తామంటూ నోటికి వచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, పొత్తులలో వ్యవహరించాల్సిన విదానం మాత్రం ఇది కాదంటూ ఆయన ఫైర్ అయ్యారు.
దాంతో ఇప్పుడు కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో అధికార బారాస కు మేలు జరుగుతుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి.వామపక్షాలు బలంగా ఉన్న సీట్లలో ఓట్లు చీలిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఛీలిపోయి అంతిమంగా అది అధికార పార్టీకి లాబిస్తుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి
.