విదేశీయులకు షాకిచ్చిన ట్రూడో.. శాశ్వత నివాస హోదా విధానంలో భారీ మార్పులు

దేశంలో పెరిగిపోతున్న వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడాలోని జస్టిన్ ట్రూడో( Justin Trudeau in Canada ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.వలసదారుల రాకపై పరిమితి విధించాలని ట్రూడో డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.2024లో అత్యథికంగా 4,85,000 మంది విదేశీయులను శాశ్వత నివాసితులుగా కెనడా ప్రభుత్వం గుర్తించింది.అయితే ప్రస్తుతం అక్కడ గృహ సంక్షోభం, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకోవడంతో వలసలను అడ్డుకోవాలని ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది.

 Canadian Govt Plans Sharp Cut In Immigrant Visas, Permanent Resident Numbers To-TeluguStop.com

అన్నింటికి మించి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ జస్టిన్ ట్రూడోపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది.ముందస్తు అంచనాలు, ఓపీనియన్ పోల్స్‌లో ( opinion polls )ట్రూడో బాగా వెనుకబడినట్లుగా కెనడియన్ మీడియా చెబుతోంది.

Telugu Canada, Immigrant Visas, Numbers-Telugu NRI

ఈ నేపథ్యంలో వ్యతిరేకత తగ్గించి తిరిగి మద్ధతు కూడగట్టడానికి లిబరల్స్ పావులు కదుపుతున్నారు.దీనిలో భాగంగానే విదేశీ వలసదారులపై పరిమితులు విధించాలని ట్రూడో నిర్ణయించారు.అంతేకాదు స్వయంగా ఎక్స్‌లో ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.దీని ప్రకారం 2025లో 3,80,000 మందికి మాత్రమే కెనడా పౌరసత్వం ఇవ్వనున్నారు.అలాగే 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే దేశంలోకి అనుమతించాలని యోచిస్తున్నారు. కెనడాకు ( Canada )తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నామని.

స్థానికులకు ప్రాధాన్యత విషయంలోనూ కంపెనీలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ట్రూడో తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Telugu Canada, Immigrant Visas, Numbers-Telugu NRI

కాగా.విదేశీ వర్కర్ల విధానంలో కెనడా ప్రభుత్వం ఇప్పటికే మూడు రకాల మార్పులు చేసిన సంగతి తెలిసిందే.కన్‌స్ట్రక్షన్, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఇందులో మినహాయింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస దరఖాస్తులు దాదాపు 25 శాతం తగ్గనున్నాయి, అలాగే విదేశీ విద్యార్ధుల స్టడీ పర్మిట్లు కూడా తగ్గుతాయి.దీని వల్ల భారతీయ విద్యార్ధులకు అధిక నష్టం కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో అక్కడికి వెళ్లిన వారికి, కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయ విద్యార్ధులకు తమ భవిష్యత్తుపై భయం పట్టుకుంది.ఈ ఏడాది చివరి నాటికి చాలా మంది విద్యార్ధుల వర్క్ పర్మిట్లు ముగుస్తుండటంతో .దేశం విడిచి వెళ్లాలా అనే భయం వారిని వెంటాడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube