భారత్‌ను రెచ్చగొడుతోన్న కెనడా పోలీస్ చీఫ్.. సిక్కులకు కీలక విజ్ఞప్తి

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్‌ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ప్రభుత్వం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇదే రకమైన వ్యాఖ్యలతో భారత్‌పై అక్కసు వెళ్లగక్కగా అందుకు మూల్యం చెల్లించుకున్నారు.

తాజాగా ఏడాది తర్వాత ఇండియాను మరోసారి రెచ్చగొడుతోంది కెనడా.నిజ్జర్ హత్య కేసులో ఏకంగా భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మను( Sanjay Kumar Verma ) అనుమానితుల జాబితాలో చేర్చడంతో న్యూఢిల్లీ భగ్గుమంది.

భారత్‌లోని కెనడా తాత్కాలిక హైకమీషనర్‌ను పిలిచి నిరసన తెలియజేసింది.

ఈ నేపథ్యంలో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) కీలక వ్యాఖ్యలు చేసింది.కెనడా గడ్డపై హత్యలు, దోపిడీలు, బెదిరింపులు సహా హింసాత్మక ఘటనలపై భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని భావిస్తే దానికి సంబంధించిన సమాచారంతో తమను సంప్రదించాలని ఆర్‌సీఎంపీ అధిపతి మైక్ డుహెమ్ ( Mike Duhem)కెనడా సిక్కులను కోరారు.కెనడా- భారత్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం మైక్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

రెండ్రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.భారత్‌లోని కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సహా కెనడాలోని క్రిమినల్ గ్యాంగ్‌లతో భారతీయ దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.వీరు కెనడాలో హత్యలు, దోపిడీలు సహా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు.

ఈ ఘటనలకు సంబంధించి 8 మందిపై హత్య, 22 మందిపై దోపిడీ ఆరోపణలు చేసింది ఆర్‌సీఎంపీ.అయితే ఇప్పటి వరకు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య( Hardeep Singh Nijjar) వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లుగా ఆర్‌సీఎంపీ ఆధారాలు బహిర్గతం చూపించలేకపోయింది.

సమాచారం సేకరిస్తూనే ఉన్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ దళాలు చెబుతున్నాయి.తాజాగా ఆర్‌సీఎంపీ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు