అమెరికా- కెనడా మధ్య రవాణా సేవలు అందించే ట్రక్కర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్న కెనడా ప్రభుత్వ నిర్ణయం అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే.ట్రూడో సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రాజధాని ఒట్టావాను ముట్టడించారు.
దీంతో నగరానికి వచ్చే రహదారులన్నీ ట్రక్కులతో కిక్కిరిసిపోయింది.ఉద్రిక్తతల నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాయి.
వందలాది ట్రక్కులు రాజధాని ఒట్టావాను చుట్టుముట్టడంతో నగర మేయర్ అత్యవసర పరిస్థితిని విధించారు.
పరిస్ధితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతుతుండటంతో పోలీసులు బలప్రయోగానికి సిద్ధమయ్యారు.
దీనిలో భాగంగా అమెరికా- కెనడాల మధ్య అత్యంత కీలకమైన అంబాసిడర్ బ్రిడ్జిని దిగ్బంధించిన నిరసనకారులను తొలగించేందుకు కెనడా పోలీసులు భారీగా మోహరించారు.వరుసగా ఐదవ రాజు అంబాసిడర్ బ్రిడ్జిని ముట్టడించిన ఆందోళనకారులు.
అంతర్జాతీయ వాణిజ్యానికి ఇబ్బంది కలిగించారు.ఇది అమెరికాకు సైతం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆందోళనకు ముగింపు పలకాలని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలోని డెట్రాయిట్.
కెనడాలోని విండ్సర్‌లను కలిపే అంబాసిడర్ బ్రిడ్జ్‌కు శనివారం ఉదయం భారీగా చేరుకున్న పోలీసులు.నిరసనకారులను తొలగించారు.
ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది ప్రజలు అక్కడికి చేరుకోవడంతో పోలీసుల ఆపరేషన్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.అయితే మరింత మంది అక్కడికి చేరుకోకుండా బారీకేడ్లను అడ్డుగా పెట్టారు పోలీసులు.
ఉత్తర అమెరికాలో అత్యంత రద్దీగా వుండే సరిహద్దు క్రాసింగ్‌లలో ఒకటైన అంబాసిడర్ బ్రిడ్జ్ మూసివేత కారణంగా డెట్రాయిట్‌లోని కారు తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీని వల్ల చోటు చేసుకునే ఆర్ధిక నష్టాన్ని పరిమితం చేయడానికి యూఎస్- కెనడా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఫ్రీడమ్ కాన్వాయ్ నిరసనల్లో భాగంగా ట్రక్కర్లు.అంబాసిడర్ బ్రిడ్జ్‌పై రాకపోకలను అడ్డుకోవడం ప్రారంభించారు.ఆందోళనల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో జనరల్ మోటార్స్ కో, క్రిస్లర్- పేరెంట్ స్టెల్లాంటిస్, ఫోర్డ్ మోటార్ కో, టయోటా మోటార్ కార్ప్ వంటి కారు తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇప్పటి వరకు ఈ దిగ్బంధనాల వల్ల ఆటోమొబైల్ పరిశ్రమకు 700 మిలియన్ డాలర్ల నష్టం కలిగివుండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.