కరోనా తరువాత అన్ని దేశాలు దాదాపు ఆర్ధిక ఇబ్బందులను ఎడుర్కున్నాయి.ముఖ్యంగా ఆర్ధిక మూలాలున్న దేశాలన్నీ కుదేలయ్యిపోయాయి.
ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కుతున్నా మరింత బలైమన వ్యవస్థను నిర్మించాలని ప్రణాలికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే బ్రిటన్ టెకీ రంగంపై దృష్టి పెట్టింది.
అమెరికా కరోనాతో కుదేలయ్యిపోయినా సరే మళ్ళీ గాడిలో పడటానికి ప్రధాన కారణం అక్కడి టెకీ రంగం.ఇప్పుడు బ్రిటన్ కూడా ఆదిశగానే అడుగులు వేస్తోంది.
తమదేశంలోకి అడుగు పెట్టే టెక్ నుపుణులు జారిపోకుండా వారికి శాశ్వత హోదా కలిగించేలా చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగానే
ఎక్స్ ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ పేరుతో ఓ ముసాయిదా బిల్లును రూపొందిస్తోంది.
గతంలో ఉన్న పాయింట్ బేసిడ్ ఎక్స్ ప్రెస్ ఎంట్రీ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తోంది.అత్యంత నైపుణ్యం కలిగిన విద్యార్ధులను, టెక్ రంగ నిపుణులను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది.
ముఖ్యంగా భారత్ లోని ప్రతిభ కలిగిన వారికోసం జల్లెడ పడుతోంది.భారత్ నుంచీ అధిక శాతం మంది నైపుణ్యం కలిగిన విద్యార్ధులు, ఉద్యోగులను అమెరికా ఎగరేసుకు పోతున్న తరుణంలో తాజాగా చేయనున్న మార్పులు భారతీయులకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టనున్నాయి.
నిపుణులను ఎంచుకునే క్రమంలో తమవద్దకు వచ్చిన వారిని లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి ఎంపిక అయిన వారికి శాశ్వత హోదా కల్పించనున్నారట.ఈ బిల్లు అమలయితే ముఖ్యంగా లాభపడేది భారతీయ విద్యార్ధులు, ఉద్యోగులే నని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే భారతీయ విద్యార్ధులు ఎంతో మంది ఎంబీఏ, ఎంఎస్, కంప్యూటర్ సైన్స్ ఇలా పలు కీలక కోర్సులు చదివి ఉన్నారని అంతేకాక అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నారని అందుకే మన వారికి విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు వేగంగా వస్తున్నాయని కేవలం భారతీయ విద్యార్ధులను ఆకర్షించడానికే దాదాపు అన్ని దేశాలు ఇలా ఆకర్షణీయమైన పధకాలు ప్రవేశపెడుతుంటాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.