భారతదేశంలో ఇపుడు అంతటా వినబడుతున్న అంశం.దేశం పేరు మార్చడం.
అవును, మన దేశాన్ని పాశ్చాత్యలు ఇండియాగా అభివర్ణించడం జరిగింది.అక్కడినుండే ఆ పేరు స్థిరపడిపోయింది.
అయితే మనది భారత గడ్డ.మరి ఆ పేరుని మార్చి ఇండియాగా మలచడం వెనుక అప్పట్లో చాలా కసరత్తులు జరిగాయట.
అది మనకి నచ్చకపోయినా బ్రిటీస్ వాడి పరిపాలనలో మనకి తప్పలేదు.ఆ తరువాత కాలంలో అదే పేరు స్థిరపడిపోయింది.
ఈ క్రమంలో చాలమందికి చాలా అనుమానాలు వస్తున్నాయి.ఇంతకీ దేశం పేరు మార్చుకోవచ్చా? అలా జరుగుతుందా అని!అయితే మనకు తెలిసి చాలా దేశాలు తమ పేరు మార్చుకున్నాయి.ఈ రకంగా పేర్లు మార్చుకున్న 7 దేశాలు ఏవో ఓ లుక్ వేద్దాం పదండి.
1.రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా (నార్త్ మెసిడోనియా)ఈ మార్పు 2019లో జరిగిందనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.మాసిడోనియా ( Macedonia )అనే పేరు ఉపయోగించడం వల్ల గ్రీస్‌లో పలు రకాల అభ్యంతరాలు స్టార్ట్ అయ్యాయి.
కానీ ఇలా చేయడం వల్ల ఉత్తర మాసిడోనియా యొక్క నాటో సభ్యత్వం, రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యం మెరుగుపరచడానికి మంచి మార్గం కూడా ఏర్పడింది.

2.సిలోన్ (శ్రీలంక)రావణుడి లంకగా భారతీయుల మహాకావ్యమైన రామాయణంలో వర్ణించబడిన సింహళం ( Sinhala )(సిలోన్ ద్వీపం) 1972 ప్రాంతంలో తన పేరు మార్చుకొని శ్రీలంకగా అవతరించింది.
3.
బర్మా (మయన్మార్)అఖండ భారత భూమిలో భాగమైన బర్మా (బ్రిటిష్) వాళ్ళ పుణ్యమా అని మన పొరుగు దేశంగా మారింది.అయితే 1989లో బర్మాను పరిపాలిస్తున్న మిలిటరీ జుంటాచే ఈ దేశం పేరు మయన్మార్ ( Myanmar )గా రూపుదిద్దుకుంది.

4.కాంగో డెమోక్రటి (రిపబ్లిక్‌కి జైర్)1997లో ఆఫ్రికా ఖండానికి చెందిన జైర్ దేశం తన పేరును డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో( Congo ) గా మార్చుకుంది.3 దశాబ్దాల నిరంకుశ పాలన చేసిన మొబుటు సేసే సెకో నియంత పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వ్యవస్థకు మారే క్రమంలో ఈ మార్పు సంభవించింది.
5.సియామ్ (థాయిలాండ్)1939లో సియామ్ తన పేరును థాయిలాండ్( Thailand ) గా మార్చడం జరిగింది.థాయిలాండ్ అంటే స్వేచ్ఛ భూమి అనే అర్థం వస్తుంది.

6.చెకోస్లోవాకియా (చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా)1993లో అప్పటివరకు చెకోస్లోవాకియా గుర్తింపు పొందిన దేశం కాస్త.చెక్ రిపబ్లిక్, స్లోవేకియా( Czech Republic, Slovakia ) అనే 2 దేశాలుగా విడిపోయింది.
7.తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)భారత్ భూభాగంలో భాగమైన ఈస్ట్ బెంగాల్ ప్రాంతం స్వాతంత్రం సమయంలో పాకిస్థాన్( Pakistan ) వైపు వెళ్లిపోయింది.ఆ తర్వాత 1971లో పశ్చిమ పాకిస్తాన్ తో జరిగినటువంటి ఘోరమైన యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అనే పేరుతో కొత్త దేశంగా ఆవిర్భవించింది.పో
.