Samantha: ఆ ఛాలెంజ్ ని సమంత స్వీకరిస్తుందా.. యువ హీరోలతో జోడి కడుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సమంత నటించిన శాకుంతలం సినిమా( Shaakuntalam ) ఇటీవలె విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 Can Samantha Mesmerise Audience With Kushi-TeluguStop.com

ఇది ఇలా ఉంటే సమంత తాజాగా నటిస్తున్న చిత్రం ఖుషి.( Kushi Movie ) ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.కాగా చాలా కాలం తర్వాత సమంత ప్రేమ కథలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే వరుసగా రెండు ఫ్లాప్ ల తర్వాత సమంత లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది.

అయితే ఈ ప‌రిస్థితుల్లో ల‌వ్ స్టోరీలో మెప్పిస్తుందా? లేదా? అనేది చాలామందిలో ఉన్న సందేహం.ప్రేమ క‌థల్లో ఎప్పుడూ క‌థానాయిక‌దే కీల‌క పాత్ర‌.ఆమె పాత్ర చిత్ర‌ణ‌, స్క్రీన్ ప్రెజెన్స్ ఆక‌ట్టుకోవాలి.అలాంటి సినిమాలే ఆడాయి కూడా.ఏం మాయ చేశావేలో జెస్సీని గుర్తు తెచ్చుకోండి.

ఆమె తెర‌పై క‌నిపిస్తే చాలు యువ‌తరం హృద‌యాలు పుల‌కించిపోయాయి.ల‌వ్ స్టోరీల్లో క‌నిపించాల్సిన మేజిక్ అదే.మ‌రి అది ఖుషీలో రిపీట్ అవుతుందా? స‌మంత‌ని ల‌వ్ స్టోరీల్లో ఇప్పుడు చూడ‌గ‌ల‌మా? అంటే సందేహాలు రాక మానదు.ఫ్యామిలీమెన్‌, య‌శోద చూశాక‌ మ‌ళ్లీ స‌మంత‌ని ల‌వ్ స్టోరీల్లో ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే అని చెప్పవచ్చు.

Telugu Kushi, Love Story, Samantha, Samantha Kushi, Samanthayoung, Shaakuntalam,

స‌మంత ఈమ‌ధ్య యాక్ష‌న్ ఇమేజ్ వైపు ట‌ర్న్ తీసుకొంది.లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల వైపు దృష్టి పెడుతోంది.ఇలాంటి ద‌శ‌లో ఓ ల‌వ్ స్టోరీని ఒప్పుకోవ‌డమే సాహ‌సం.కానీ ఆ సాహ‌సం స‌మంత చేసింది.తెర‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ,స‌మంత ల కెమిస్ట్రీ ఎంత బాగుంటే ఖుషి అంత బాగుంటుంది.ఖుషి సినిమాలో నుంచి మొద‌టి పాట ఇటీవ‌లే విడుద‌లైంది.

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్.లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

కాగా సమంత, విజయ్ జోడి కుదరలేదని సమంత విజయ్ దేవరకొండకి అక్కలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Kushi, Love Story, Samantha, Samantha Kushi, Samanthayoung, Shaakuntalam,

కొంతమంది మాత్రం ఒక పాట చూసి సినిమాను మొత్తం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి సమంతకు ఈ సినిమా పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు.ఈ సినిమాతో త‌ను ల‌వ్ స్టోరీ లు చేయ‌గ‌ల‌న‌ని ఇప్పుడు నిరూపించుకోవాలి.

అలాగే యువ హీరోల‌తోనూ జోడీ క‌ట్ట‌గ‌ల‌న‌నే సంకేతాలు పంపాలి.అప్పుడు స‌మంతని వెదుక్కొంటూ కొత్త క‌థ‌లొస్తాయి.

మ‌రి ఈ ఛాలెంజ్‌ని స‌మంత ఎంత వ‌ర‌కూ స్వీక‌రిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube