సినీ పరిశ్రమలో తారలకు భాషతో పని లేకుండా ఏ భాషలో అయినా నటించే స్వాతంత్యం ఉంది.అయితే గతంలో మన సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ స్టార్స్ నటించేందుకు పెద్దగా ఇష్టం చూపించే వారు కాదు.
కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో సౌత్ ఇండస్ట్రీ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ చాలా ఎదిగింది.స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ప్రజెంట్ అందరు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్( Bollywood ) హీరోలు, హీరోయిన్స్ కూడా ఇక్కడ సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు.
మరి ఈ లిష్టులో ఇప్పుడు చాలా మంది చేరిపోతున్నారు.అందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్( Saif Ali Khan ) ఒకరు.
ఈయన బాలీవుడ్ లో మూడు దశాబ్దాలకు పైగానే సక్సెస్ ఫుల్ హీరోగా కెరియర్ కొనసాగించాడు.
అయితే ప్రజెంట్ ఈయన అన్ని రకాల పాత్రలను చేయడానికి ఇష్టపడుతున్నాడు.మన సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు సైఫ్.ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్( Adipurush ) సినిమాలో రావణాసురుడిగా నటించాడు.
ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్ లో కూడా విలన్ రోల్ కోసం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్స్ ఎవ్వరూ కూడా తెలుగులో విలన్ రోల్ చేసి సక్సెస్ కొట్టలేదు.ఇర్ఫాన్ ఖాన్, వివేక్ ఒబరాయ్, జాకీష్రాఫ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి స్టార్స్ విలన్ గా సక్సెస్ సాధించలేక పోయారు.మరి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సైఫ్ అలీ ఖాన్ అయినా విలన్ రోల్ లో మెప్పిస్తాడా లేదా అనేది కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.