న్యాచురల్ స్టార్ నాని( Nani ) అంటే సుందరానికి తర్వాత తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతున్నాడు.ఈ సినిమా ప్లాప్ తర్వాత ఎప్పుడైతే ‘దసరా( Dasara )వంటి పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం నాని ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు.
ఎప్పుడు క్లాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు మాస్ హీరోగా మారిపోయాడు.
నాని కూడా పాన్ ఇండియన్ వ్యాప్తంగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ”దసరా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆ లెవల్లోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు.
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ఈ ట్రైలర్ తెలుగులో ఎంత రెస్పాన్స్ అందుకుందో మిగిలిన భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ ట్రైలర్ ఏకంగా 20 మిలియన్లకు పైగానే వ్యూస్ రాబట్టి 4.60 లక్షల లైక్స్ కూడా సాధించింది.ఇలా దసరా సినిమా రికార్డును క్రియేట్ చేసింది.ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో రిలీజ్ తర్వాత కూడా కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ మోగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొనేలా చేసింది.

దసరా సినిమాలో ధరణి రోల్ లో ఊర మాస్ లుక్ లో నాని బాగా ఆకట్టు కుంటున్నాడు.నానికి జోడీగా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.







