ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తా.. క‌ల‌క‌లం రేపుతున్న ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ?

దేశంలో నెల‌కొన్న హిజాబ్ వివాదం ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు.క‌ర్ణాట‌క‌లో మొద‌లైన వివాదం ఏపీ రాష్ట్రం వ‌ర‌కు పాకింది.

బుర్కా వేసుకుని వ‌చ్చిన విద్యార్థుల‌ను అనుమ‌తించ‌క‌ పోవ‌డంతో వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే.ఇక ఆ ర‌చ్చ స‌ద్ధుమ‌నుగు తుంద‌ను కుంటే కొంద‌రు చేసే వ్యాఖ్య‌ల‌తో మ‌ళ్లీ హీజాబ్ వివాదం ముదిరేలా క‌నిపిస్తోంది.

Can Pieces Be Cut Into Pieces MLA Comments That Are Causing Trouble , MLA Commen

ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు గాలి దుమార‌మే రేపుతోంది.క‌ర్ణాట‌క ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్ హిజాబ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

హిజాబ్‌ను వ్య‌తిరేకించే వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాం అంటూ హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌లకు దారి తీస్తోంది.క‌ల‌బురాగిలో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

ఏదో ఒక రోజు మన‌మంతా చ‌నిపోయేవాళ్లం.ఇంత దానికి మ‌తాల‌ను అంట‌ గ‌ట్ట‌డం స‌రికాదని, అన్ని కులాలు, మ‌తాల‌ను స‌మానంగా చూడాల‌ని అన్నారు.

మీరు ఏదైనా ధ‌రించొచ్చ‌ని, మిమ్మ‌ల్ని ఎవ‌రైనా అడ్డ‌గిస్తే ఊరుకోబోమ‌ని, ఇలాంటి చ‌ర్య‌ల‌కు స‌హించ‌ బోమంటూ ఫైర్ అయ్యాడు.హిజాబ్‌ను వ్య‌తిరేకిస్తే ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాం.

అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.ఇక్క‌డే పుట్టాం.

ఇక్క‌డే చ‌స్తాం.జీవితం ఉన్న‌తం కాలం ఇండియ‌న్‌ గానే బ‌తాకా లంటూ హిత‌వు ప‌ల‌క‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

అయితే క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.పోలీసులు సైతం ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు చేశారు.

Advertisement

హిజాబ్ వివాదం స‌ద్దుమ‌ణిగేలా లేక‌పోవ‌డంతో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.ఈమేర‌కు హుబ్లీ-ధార్వాడ్‌లో ఈ నెల 28 వ‌ర‌కు విద్యా సంస్థ‌ల‌కు 200 మీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు సెక్ష‌న్ 144 అమ‌లులోకి తెచ్చారు.

స్థానిక సీపీ లాభూరామ్ కూడా ఉత్త‌ర్వులు జారీ చేశారు.రెండు జంట న‌గ‌రాల ప‌రిధిలో విద్యాసంస్థ‌ల‌కు 200 మీట‌ర్ల దూరంలో ఆందోళ‌నలు, నిర‌స‌న‌లు, త‌దిర కార్యక్ర‌మాల‌పై నిషేధం విధించారు.

ఎవ‌రైనా నిబంధ‌న‌లు బేఖాత‌ర చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.మొత్తంగా హిజాబ్ వివాదం ఎప్ప‌డు స‌ద్ధుమ‌ణుగుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు