టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ బాగా తగ్గిపోనుందనే వార్తలు వస్తున్నాయి.మరోపక్క రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరగొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆట పరంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా కోల్పోయి గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడు.రోహిత్ శర్మ మాత్రం ఊహించని రీతిలో రెండు ఫార్మాట్ల క్రికెట్ కు కెప్టెన్ అయ్యాడు.
అయితే జట్టులో ప్రస్తుత స్థానాలను బట్టి క్రికెట్ ఆటగాళ్ల బ్రాండ్ వాల్యూ మారుతుంటుంది.టీమిండియా కెప్టెన్ బ్రాండ్ వాల్యూ ఎప్పుడూ కూడా కొత్త శిఖరాలను తాకుతుంటుంది.
బాగా క్రేజ్ ఉన్న క్రికెట్ ఆటగాళ్లతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి రకరకాల బ్రాండ్స్ అనేవి ఎగబడుతుంటాయి.తమ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉండాలంటూ కంపెనీలు ఒత్తిడి చేస్తుంటాయి.
అదే సమయంలో కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తుంటాయి.
అయితే ఒకప్పుడు ధోనీ, మొన్నటిదాకా కోహ్లీ వెంట పడ్డ బ్రాండ్స్ ఇప్పుడు రోహిత్ శర్మ వెంట పడుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

అయితే విరాట్ కోహ్లీ తన సమయంలో సాధించిన బ్రాండ్ వాల్యూని రోహిత్ శర్మ అధిగమిస్తాడా అనేది ప్రశ్నగా మారింది.కోహ్లీ క్రికెట్ మైదానం లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.చాలా యాక్టివ్ గా ఉండే కోహ్లీ తన క్రేజ్ ని అభిమానులల్లో విపరీతంగా పెంచుకున్నాడు.రోహిత్ శర్మ చాలా కూల్ గా ఉంటాడు.మైదానంలో తన బాధ్యతలు నిర్వర్తించడం వరకే పరిమితం అవుతాడు.అలాంటప్పుడు అతడు అభిమానుల్లో మరింత పేరు తెచ్చుకుంటాడా? ల్యాండ్ వాల్యూ పెంచుకోగలుగుతాడా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

ప్రస్తుతానికైతే, కోహ్లీ బ్రాండ్ వాల్యూ 237.7 గా ఉంది.రోహిత్ శర్మ ఈ విషయంలో వెనుకబడ్డాడనే చెప్పాలి.రోహిత్ శర్మ ఒక్కో వాణిజ్య ప్రకటనకు రూ.80 నుంచి రూ.1.25 కోట్లు పుచ్చుకుంటాడని సమాచారం.కోహ్లీ మాత్రం దాదాపు 5 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు రోహిత్ శర్మ పారితోషికం కూడా మూణ్నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.