తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సరికొత్త సంచలన మలుపులతో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని పెద్ద ఎత్తున భావిస్తున్న తరుణంలో అమిత్ షా ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసిన అమిత్ షా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో జరిగే ప్రతి ఒక్క ధర్నా కూడా అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతుందంటే ఎంతగా అమిత్ షా తెలంగాణపై దృష్టి సారించారో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పటి వరకు తెలంగాణపై అంతగా దృష్టి సారించని అమిత్ షా ఇక నుండి దృష్టి సారించనుండటంతో అమిత్ షా వ్యూహాలను తట్టుకొని కేసీఆర్ నిలబడగలడా అనే చర్చ మొదలైంది.అయితే రాజకీయంగా ఎంతో కీలకమైన కఠినమైన పరిస్థితులను సమయాలను చూసిన కేసీఆర్ ఇప్పటి పరిస్థితులను చాలా సులభంగా ఎదుర్కొంటారనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితేకేసీఆర్ మాత్రం ఇంకా వచ్చే ఎన్నికలపై కామెంట్ చేయకున్నా ఇప్పటికే ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక గట్టి వార్నింగ్ లాంటిది ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక ఎక్కువ శాతం ప్రజల్లో ఉండాలని హైదరాబాద్ లో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయవద్దని పలు రకాల సమావేశాల్లో తెలియ జేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే.
అయితే అమిత్ షా వ్యూహాలు ఎంతగా ఫలించినా బీజేపీకి స్థానికంగా క్షేత్ర స్థాయిలో బలం లేక పోవడం అన్నది సుస్పష్టం.అంతే కాక ఇప్పటికిప్పుడు ఎంతగా కేసీఆర్ పై వ్యతిరేకత పెంచినా క్షేత్ర స్థాయిలో బలం పెంపొందించు కోవడం అసంభవం.
ఏది ఏమైనా ఇప్పటికే అమిత్ షా వ్యూహాలు అమలు చేయడానికి సిద్దమవుతున్న తరుణంలో ఎంత మేరకు ఆ వ్యూహాలు కేసీఆర్ ను రాజకీయంగా ఇరుకునపెడతాయన్నది.అదే విధంగా వాటిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది.







