Harirama Jogaiah : 24 సీట్లతో చంద్రబాబును శాసించగలరా.. పవన్‎కు హరిరామ జోగయ్య మరో లేఖ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు( Pawan Kalyan ) కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) మరో లేఖ రాశారు.జనసేన మేలు కోరి ఇచ్చే సలహాలు పవన్ కు నచ్చినట్లు లేవన్నారు.

 Can Chandrababu Rule With 24 Seats Another Letter Of Harirama Jogaiah To Pawan-TeluguStop.com

పవన్ కు, తనకు మధ్య గొడవ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.పవన్ కల్యాణ్ ను ఒంటరి చేసి చంద్రబాబుకు దాసోహం అనేలా చేయాలని కొందరు భావిస్తున్నారని ఆరోపించారు.

జనసేనకు రాష్ట్రంలో మొత్తం 40 బలమైన స్థానాలున్నాయన్న హరిరామ జోగయ్య 24 నియోజకవర్గ స్థానాలను తీసుకుని చంద్రబాబును శాసించగలరా అని ప్రశ్నించారు.

తానేప్పుడూ జనసేన ( Janasena )మేలు కోరుకుంటానని చెప్పారు.పవన్ సీఎం కావాలని కాపు, బీసీ, ఎస్టీ, ఎస్సీలు కోరుకుంటున్నారని తెలిపారు.ప్యాకేజీ వీరుడంటూ పవన్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు ( Chandrababu )మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మిత్రులు ఎవరో.శత్రువులు ఎవరో పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు.

పవన్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube