బాబు అడిగితే బాలయ్య సారీ చెప్పడా..?

తనకి ఇవే చివరి ఎన్నికలు అని.ఎలాగైనా ఈసారి మాత్రం అధికారం చేపట్టాలని చూస్తున్న చంద్రబాబుకి అతని వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కొత్త చిక్కులు తెచ్చిపెట్టాడు.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అక్కినేని తొక్కినేనిఅంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపాయి అలాగే మహానటుడు ఎస్ వి రంగారావు గారి గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా పలు వర్గాలు తీవ్రంగా స్పందించాయి.అక్కినేని వారసులు అఖిల్, నాగ చైతన్య అయితే ఏకంగా దీనిపై వారి రియాక్షన్ కూడా తెలిపారు.

సరే సినిమా వారి వ్యాఖ్యలు రాజకీయంపై పెద్దగా ప్రభావం చూపవు అనుకుంటే ఎస్వీ రంగారావు గారి గురించి చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు తీవ్రంగా స్పందించాయి.బాలకృష్ణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ వారు అధికారికంగా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు.

ఎన్నికల్లో గెలవాలంటే కాపు వర్గాల ఓట్లు కీలకం కాబట్టి జనసేన పార్టీని కలుపుకునేందుకు ఆసక్తి చూపుతున్న చంద్రబాబుకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది.బాలయ్య నోటిని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కుల సమీకరణాలు మారిపోయి జగన్ కు ఇది లభించే అవకాశం ఉంది.

Advertisement

మరొక పక్క బాలకృష్ణ మాత్రం తన దారి తనదే అన్నట్లు దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం కొసమెరుపు.మరొకవైపు చిరంజీవి అభిమానులు దొరికిందే ఛాన్స్ అన్నట్లు గతంలో బాలయ్య చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యాడని చెబుతూ రాజకీయాలు చేయడం తమ బ్లడ్ వారికే సాధ్యం పడుతుందని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.ఇలా బాలయ్య పై విపరీతమైన ట్రొల్స్ చేస్తున్నారు.

ఇలా కాపులంతా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి రివర్స్ అయిపోతున్న తరుణంలో వీటన్నింటికీ చంద్రబాబు చెక్ పెట్టాలని భావిస్తున్నాడట.బాలయ్య చేత బహిరంగంగా క్షమాపణలు చెప్పించడం ఒక్కటే ఇందుకు మార్గమని బాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం వచ్చింది.మరి బావ చెబితే బాలయ్య క్షమాపణ చెబుతాడు అనే అందరూ అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు