కాలిఫోర్నియా రెస్టారెంట్ లో ఓ మహిళ వింత గొడవ..!!!  

California Woman Attacked Mc Donalds Over Ketchup -

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ రెస్టారెంట్ వారితో గొడవ పడింది.కేవలం గొడవ మాత్రమే కాదు ఆ రెస్టారెంట్ లో పని చేసే ఓ అమ్మాయిని చావు దెబ్బలు కొట్టింది.

California Woman Attacked Mc Donalds Over Ketchup

ఇంతకీ ఎందుకు ఆమెని ఇంతగా కొడుతోంది ఆ మహిళ అని ఆరా తీసిన అక్కడి వారికి నిజం తెలిసి షాక్ అయ్యారు.ఇంతకీ ఎందుకు ఆ గొడవో మీరు ఓ లుక్కేయండి.
మనం రెస్టారెంట్ లో పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్ళినపుడు వాళ్ళు ఇచ్చినవి చాలకపోతే సరిపెట్టుకుంటాం.కానీ కాలిఫోర్నియాలో ఓ రెస్టారెంట్ కి వెళ్లిన మహిళ ఇంటికి తెచ్చుకున్న పార్సిల్ లో కెచప్ సరిగా వేయలేదని విపరీతమైన కోపం వచ్చింది.

అంతే ఆ మెక్‌డొనాల్డ్ రెస్టారెంటుకు వెళ్లి ఆ పార్సిల్ కట్టిన వాళ్ళు ఎవరో అడిగి ఆమె తో గొడవ పడింది అక్కడితో ఆగకుండా తల పట్టుకొని గోడకేసి బాదింది.

ఈ ఘటన గమనించిన మిగతా ఉద్యోగులు ఆమెని అడ్డుకున్నారు.24 ఏళ్ల ఈ మహిళ కెచప్ కోసం ఇంత వీరంగం సృష్టించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.కెచప్ కావాలంటే అడగాలి కానీ ఇలా చేస్తారా అంటూ ఆమెని మందలించారు.

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు