కాలిఫోర్నియా రెస్టారెంట్ లో ఓ మహిళ వింత గొడవ..!!!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ రెస్టారెంట్ వారితో గొడవ పడింది.కేవలం గొడవ మాత్రమే కాదు ఆ రెస్టారెంట్ లో పని చేసే ఓ అమ్మాయిని చావు దెబ్బలు కొట్టింది.

ఇంతకీ ఎందుకు ఆమెని ఇంతగా కొడుతోంది ఆ మహిళ అని ఆరా తీసిన అక్కడి వారికి నిజం తెలిసి షాక్ అయ్యారు.

ఇంతకీ ఎందుకు ఆ గొడవో మీరు ఓ లుక్కేయండి.మనం రెస్టారెంట్ లో పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్ళినపుడు వాళ్ళు ఇచ్చినవి చాలకపోతే సరిపెట్టుకుంటాం.

కానీ కాలిఫోర్నియాలో ఓ రెస్టారెంట్ కి వెళ్లిన మహిళ ఇంటికి తెచ్చుకున్న పార్సిల్ లో కెచప్ సరిగా వేయలేదని విపరీతమైన కోపం వచ్చింది.

అంతే ఆ మెక్‌డొనాల్డ్ రెస్టారెంటుకు వెళ్లి ఆ పార్సిల్ కట్టిన వాళ్ళు ఎవరో అడిగి ఆమె తో గొడవ పడింది అక్కడితో ఆగకుండా తల పట్టుకొని గోడకేసి బాదింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ ఘటన గమనించిన మిగతా ఉద్యోగులు ఆమెని అడ్డుకున్నారు.

24 ఏళ్ల ఈ మహిళ కెచప్ కోసం ఇంత వీరంగం సృష్టించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

కెచప్ కావాలంటే అడగాలి కానీ ఇలా చేస్తారా అంటూ ఆమెని మందలించారు.

వీడియో వైరల్: వేప చెట్టుకు మామిడి పండ్లు.. ఎప్పుడైనా చూసారా..?