రాష్ట్రంలో కుల వివక్షను నిషేధించే బిల్లును అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ సెనేట్( California State Senate ) గురువారం ఆమోదించింది.34-1 ఓట్ల తేడాతో ఆమోదించబడిన ఈ చట్టం ప్రకారం.గృహ నిర్మాణం, ఉద్యోగం, విద్య, ఇతర సందర్భాలలో వివక్షకు సంబంధించిన ఆరోపణలను పరిష్కరించడానికి వ్యక్తులకు చట్టపరమైన మద్ధతు లభిస్తుందని సీఎన్ఎన్ నివేదించింది.కులవివక్ష.దాని ఫలితంగా హానిని ఎదుర్కొన్న వారికి “SB 403″లో పేర్కొన్న నిబంధనలు రక్షణ కల్పిస్తాయి.కులవివక్ష కారణంగా చోటు చేసుకున్న హింసను క్షమించడం, ఇందులో పాల్గొనడం, జవాబుదారీగా వుండి బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే ఎవరైనా చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వుంటుంది.
కులవివక్ష వ్యతిరేక చట్టాన్ని ఈ ఏడాది మార్చిలో డెమొక్రాటిక్ స్టేట్ సెనేటర్ ఐషా వాహబ్( Aisha Wahab ) ప్రతిపాదించారు.శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఫ్రీమాంట్ సిటీలో తాను పెరుగుతున్నప్పుడు .కులం కారణంగా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని తాను చూసినట్లు ఐషా పేర్కొన్నారు.అమెరికాలోని వివిధ, మత , కుల సంస్థలు కూడా ఈ బిల్లుకు మద్ధతు పలికాయి.
సెనేట్ ఈ బిల్లును ఆమోదించి పరిశీలన నిమిత్తం కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీకి పంపింది.

ఇకపోతే.కుల వివక్షను నిషేధించాలని కోరుతూ ప్రతిపాదించిన బిల్లుకు కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ జ్యుడీషియరీ కమిటీ( California State Senate Judiciary Committee ) ఏప్రిల్ చివరిలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.అయితే దీనికి భారతీయ అమెరికన్ వ్యాపార, ఆధ్యాత్మిక సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
కులవివక్ష వ్యతిరేక బిల్లును సెనేట్‌కు పంపేందుకు కాలిఫోర్నియా సెనేట్ జ్యుడిషీయరీ కమిటీ అనుకూలంగా ఓటు వేసింది.అమెరికాలోని ఏదైనా రాష్ట్ర శాసనసభ కులంపై చట్టాన్ని పరిగణనలోనికి తీసుకోవడం ఇదే తొలిసారి.
ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే.రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక చట్టాల ద్వారా కులపక్షపతాన్ని చట్టవిరుద్ధం చేసిన తొలి అమెరికా రాష్ట్రంగా కాలిఫోర్నియా అవతరిస్తుంది.

కాగా.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని సీటెల్ నగరం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది.తద్వారా ఈ నిర్ణయం తీసుకున్న తొలి అమెరికన్ నగరంగా సీటెల్ అవతరించింది.దీని వెనుక భారత సంతతికి చెందిన క్షమా సావంత్(kshama Sawant ) కృషి వుంది.కుల వివక్షను నిర్మూలించేందుకు ఆమె ఎంతో శ్రమించారు.
ఈ క్రమంలోనే కుల వివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానానికి సీటెల్ సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.అయితే కులవివక్షను వ్యతిరేకిస్తూ ప్రతిపాదిత బిల్లుపై అక్కడి భారతీయ వ్యాపార వర్గాలు, ఆధ్యాత్మిక సంస్థలు అభ్యంతరం చెబుతున్నాయి.20 వేల మంది సభ్యులతో అమెరికాలో అతిపెద్ద హోటల్ యజమానుల సంఘమైన ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్స్, దేశవ్యాప్తంగా 8,300 దుకాణాల యజమానులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసియా అమెరికన్ స్టోర్ ఓనర్స్ అసోసియేషన్స్ బిల్లును ఖండించాయి.అలాగే హిందూ మందిర్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, హిందూ బిజినెస్ నెట్‌వర్క్, హిందూ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకసీ కలెక్టివ్ కూడా బిల్లును విమర్శించాయి.
మెజార్టీ ఇండో అమెరికన్లు పబ్లిక్ పాలసీలో కులాన్ని క్రోడీకరించడం వల్ల అమెరికాలో హిందూఫోబియాకు మరింత ఆజ్యం పోస్తుందని భయపడుతున్నారు.







