తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై భారీ కేబుల్ బ్రిడ్జి ఏర్పాటుకానుంది.సోమశిల వద్ద ప్రతిపాదించిన ఈ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపింది.
దీంతో మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవనుంది.రూ.1,082 కోట్లతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంది.కాగా, ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే, దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన ఉండనుంది.