ఒకవైపు విలన్లుగా, మరోవైపు కమెడియన్లుగా మెప్పించిన సినీ సెలబ్రిటీలు వీళ్లే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు.కొంతమంది నటులు ఎలాంటి పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు.

 Shocking Facts About Tollywood Cine Celebrities Details Here Goes Viral , Ravugo-TeluguStop.com

మరి కొందరు నటులు ఒకే తరహా పాత్రలకు పరిమితమైనా ఆ పాత్రలలో తాము తప్ప మరెవరూ గొప్పగా నటించలేరనేంత అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.టాలీవుడ్ కు చెందిన కొందరు నటీనటులు అటు విలన్లుగా ఇటు కమెడియన్లుగా మెప్పించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగులోని చాలా సినిమాలలో కోట శ్రీనివాసరావు కామెడీ చేస్తూనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.

తెలుగులో విలన్ రోల్స్ లో మెప్పించిన నటులలో రావుగోపాలరావు ఒకరు.కొన్ని సినిమాలలో రావుగోపాలరావు కామెడీ రోల్స్ లో సైతం నటించి మెప్పించడం గమనార్హం.అటు కామెడీ రోల్స్ లో, ఇటు విలన్ గా మెప్పించిన నటులలో పరేశ్ రావెల్ ఒకరు.

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి మామ పాత్రలో ఆయన నటనను సులువుగా మరిచిపోలేము.

మరో ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఫ్యాక్షనిస్ట్ పాత్రలలో నటించినా, కామెడీ రోల్స్ లో నటించినా జయప్రకాష్ రెడ్డికి మరెవరూ సాటిరారు.

రఘుబాబు, రాహుల్ దేవ్ మరి కొందరు నటులు సైతం అటు విలన్లుగా ఇటు కమెడియన్లుగా పని చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు.

టాలెంట్ ఉన్న టాలీవుడ్ విలన్ కమ్ కమెడియన్లు ఇతర భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందడం గమనార్హం.ఈ నటులకు విలన్లుగా, కమెడియన్లుగా మంచి పేరు రావడంలో ఎంతోమంది దర్శకుల పాత్ర ఉందని చెప్పవచ్చు.రాబోయే రోజుల్లో ఈ జాబితాలో చేరే నటులు ఎవరో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube