టీడీపీకి టాలీవుడ్ పెద్దల మద్దతు కోసం చంద్రబాబు భారీ స్కెచ్!

ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో  తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి సత్తా చాటడానికి సిద్దమవుతుంది. విభజనకు ముందు తెలంగాణ టీడీపీకి కంచుకోటగా ఉండేది కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  కనుమరుగైంది.

 Buzz Chandrababu Big Sketch For Tollywood Details, Bharat Rashtra Samithi, Brs,-TeluguStop.com

 అయితే తాజాగా అంశాలతో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు.తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడంతో, ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా అవతారమెత్తేందుకు టీడీపీకి అతిపెద్ద అవకాశం దొరికింది.

ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం సీఎంగా సని చేసిన చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన పార్టీలను ఢీకొట్టేందుకు భారీ స్కెచ్‌ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  టీడీపీకి ఇంతకుముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి ఏకపక్ష మద్దతు ఉండేది.

ఇప్పు వారి  మద్దతును తిరిగి పొందడానికి చంద్రబాబు  భారీ స్కెచ్ వేశారు.వారీ సహయంతో టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి సిద్దమవుతున్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని సిద్దం చేయడానికి కొంత మంది తెలుగు చలన చిత్ర పెద్దలను కలవాలని,

కొన్ని విషయాలను వారితో చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో కనీసం 5-10 సీట్లు కైవసం చేసుకోవాలని, తద్వారా తెలంగాణలో తమ ఉనికి చాటాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సైకిల్ సార్టీకి ఇంతకు ముందు క్యాడర్ ఉన్నందున, చంద్రబాబు తన స్కెచ్‌లను సరిగ్గా వేస్తే ఖచ్చితంగా విజయవంతం  అవవచ్చు. అయితే  తెలంగాణాలో పార్టీ బలపడాలంటే ప్రత్యర్థి సదించే ప్రశ్నలకు టీడీపీ సరైయన సమాధానం చెప్పాలి.

చూాడాలి వచ్చే ఎన్నికల్లో పార్టీ  ఎంత వరకు ప్రభావం చూపుతుందోొ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube