యూఎస్ అధికారులకు టెన్షన్ పుట్టించిన ప్రైవేట్ విమానం.. ఆపై కుప్పకూలిపోయింది!

ఆదివారం మధ్యాహ్నం అమెరికాలోకి ( America ) ప్రవేశించిన ఒక చిన్న ఫ్లైట్( Flight ) యూఎస్ అధికారులకు చెమటలు పట్టించింది.ఈ విమానం అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ లోకి ఎంటర్ అయ్యి వైట్ హౌస్ మీదగా చక్కర్లు కొట్టింది.

 Business Jet Circles White House And Crashes In Virginia Details, Pilot, Unrespo-TeluguStop.com

ఈ అనుమానాస్పద ప్రైవేట్ జెట్ ఎలాంటి హాని తలపడుతుందోనని యూఎస్ అధికారులు దాన్ని ఆపేందుకు ఆగ మేఘాల మీద రంగంలోకి దిగారు.ఎలాంటి వివరాలు తెలియకుండా దీనిని కూల్చేయడం తప్పు కాబట్టి అధికారులు ఆ ఫ్లైట్ లోని పైలెట్ ని సంప్రదించడానికి ప్రయత్నించారు.

కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

టెన్నిసీ సిటీలోని ఎలిజబెత్ టౌన్ నుంచి న్యూయార్క్ లోని మెక్ ఆర్థర్ ఎయిర్ పోర్టుకు ఈ ఫ్లైట్ బయలుదేరినట్లు తర్వాత అధికారులు తెలుసుకున్నారు.

అయితే ఆ రూట్ లో వెళ్లాల్సిన ఈ బిజినెస్ జెట్ వాయు మార్గంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికి డైరెక్షన్ మార్చేసి అమెరికా రాజధాని వైపు రావడం మొదలు పెట్టింది.దీనిని గమనించిన అధికారులు సమాధానం కోసం ప్రయత్నించారు.

ఈ ప్రయత్నంలో విఫలం కావడంతో వారు ఎఫ్-16 ఫైటర్ జెట్‌తో ఆ విమానాన్ని ఫాలో అయ్యారు.ఈ సమయంలో ఆకాశంలో విమానాలు చేసిన భారీ శబ్దాలు, గందరగోళం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

Telugu America, Jet, International, Pilot, Virginia, Virginiaplane, Washington D

ఆ బిజినెస్ జెట్ యొక్క పైలెట్ దృష్టిని ఆకట్టుకునేందుకు యుద్ధ విమానం నుంచి యూఎస్ అధికారులు మంటలు కూడా ప్రొడ్యూస్ చేశారు.ఈ మంటలు కూడా స్థానికులను కాస్త భయానికి గురిచేశాయి.దాంతో వారు తమ ఇళ్లలోకి పరుగులు తీశారు.ఈ క్రమంలోనే ఆ ప్రైవేటు బిజినెస్ విమానం వర్జినియా ( Virginia ) వైపు వెళ్లడం మొదలు పెట్టింది.

అనంతరం ఒక అటవీ ప్రాంతంలో అది కుప్పకూలిపోయింది.

Telugu America, Jet, International, Pilot, Virginia, Virginiaplane, Washington D

కుప్పకూలిపోయిన ఈ విమానాన్ని పరిశీలించిన తర్వాత అది ఫ్లోరిడాలోని ఎన్‌కోర్ మోటార్స్ కంపెనీ పేరుతో ఈ రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.ఈ కంపెనీ యజమాని జార్ రాంపెల్ ఈ ఘటనపై మాట్లాడారు.తన కుమార్తె, 2 ఏళ్ల మనవరాలు, సహాయకురాలు, పైలట్ ఈ బిజినెస్ జెట్ ప్రయాణిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తనను చూసేందుకు ఈ విమానంలో వచ్చారని, తర్వాత తిరుగు ముఖం పట్టారని అన్నారు.అయితే విమానం కుప్పకూలిపోయిన ప్రదేశంలో నలుగురు ప్రయాణికులు చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు.వారి మృతదేహాల అవశేషాల ప్రకారం వారిని గుర్తిస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube