కారు డ్రైవర్‌ను చితకబాదిన బస్సు డ్రైవర్.. వీడియో వైరల్...

సాధారణంగా రద్దీగా ఉన్న రోడ్లపై వెళ్తున్నప్పుడు ముందు, వెనుక వాహనాలను ఒకదానికొకటి గుద్దుకోవడం జరుగుతుంటుంది.ఊహించని ట్రాఫిక్ వల్ల బ్రేకులు సకాలంలో వేయనప్పుడు ఇలా జరుగుతుంటుంది.

 Bus Driver Who Crushed The Car Driver Video Viral, Viral Video, Latest News, Tre-TeluguStop.com

అయితే ఇలా డ్యాష్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి డ్రైవర్లు ఒకరికొకరు గొడవ పడుతుంటారు.అయితే ఇటీవల ఇలాంటి ఘటన కొట్లాటకు దారితీసింది.

తాజాగా కేరళలో రద్దీగా ఉన్న రోడ్డులో బస్సును ఓ కారు ఢీకొట్టింది.దీనివల్ల బస్సుకు కాస్త డ్యామేజ్ అయింది.

దీని ఫలితంగా బస్సు, కారు డ్రైవర్ మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.ఆ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, బస్సు డ్రైవర్ తన సీటు నుంచి దిగేసి కారు డ్రైవర్‌పై పిడుగులు గుద్దుతూ కనిపిస్తాడు.కారు డ్రైవర్ కి కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా బస్సు డ్రైవర్ తన్నేస్తూ, చెంపలు పగలగొట్టేస్తూ బాగా రెచ్చిపోయాడు.

ఆగ్రహంతో ఊగిపోతూ బస్సు డ్రైవర్‌ కారు డ్రైవర్‌ను చితక బాదుతుంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఈ ఇద్దరి డ్రైవర్లను విడదీయడానికి ప్రయత్నించారు, కానీ వారు గొడవ పడుతూనే ఉన్నారు.

ఈ ఘటన మొత్తాన్ని ఎవరో తన మొబైల్‌లో రికార్డు చేయగా దానిని ట్విట్టర్( Twitter ) యూజర్ ఒకరు షేర్ చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టించింది.కొంతమంది బస్సు డ్రైవర్( Bus driver ) కు మద్దతుగా మాట్లాడితే మరి కొంతమంది మాత్రం కారు డ్రైవర్ కు మద్దతుగా కామెంట్లు చేశారు.

అయితే ఎవరిది తప్పు అనేది నిర్ణయించడానికి వీడియోలో గొడవ మొదటి నుంచి కనిపించ లేదని మరికొందరు అన్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube