జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను కాల్చివేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలను తగలబెట్టారు.
గద్వాల నియోజకవర్గ టికెట్ ను పటేల్ ప్రభాకర్ రెడ్డికి కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు ఆందోళన చేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పటేల్ ప్రభాకర్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని కలిశారని తెలుస్తోంది.
భేటీ అనంతరం పటేల్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో పార్టీలో చేరారు.







