ఈ కొండచిలువకు కోపం ఎక్కువ..మొసలిని ఏం చేసిందో తెలుసా...

ఓ పెద్ద మొసలి, పెద్ద కొండచిలువ… నీటిలో ఎదురుపడ్డాయి.ఒకదాన్ని ఒకటి గుర్రుగా చూసుకున్నాయి.

 Burmese Python And Alligator Fight In Florida Everglades Details, Burmese Python-TeluguStop.com

మాటల్లేవ్ అనుకుంటూ యుద్ధానికి దిగాయి.ఫైట్ మామూలుగా జరగలేదు.

మొసలిని బలంగా చుట్టుకొని కొండచిలువ… వదిలితేనే వదులుతా అని పంతం పట్టింది.గంటలతరబడి ఈ యుద్ధం సాగింది.

బలంగా చుట్టుకోవడంలో కొండచిలువలకు తిరుగులేదు.

కొండచిలువల్లో బర్మా కొండచిలువలకు కోపం ఎక్కువ.

వాటి జోలికొస్తే అస్సలు ఊరుకోవు.దేన్నైనా మింగేయాలి అనుకుంటే ఆ కొండచిలువలు ఏమాత్రం వెనక్కి తగ్గవు.

పంతం నీదా నాదా సై అంటాయి.అలాంటి కొండచిలువల్లో కొన్ని అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లాడ్స్‌లో ఉన్నాయి.

ఫ్లోరిడాలో మొసళ్లు ఎక్కువ.అది తమ అడ్డాలా అవి ఫీలవుతాయి.

ఈ కొండచిలువల్ని చూడగానే.ఆటోమేటిక్‌గా మొసళ్లకు కోపం వస్తుంది.

మాకే ఇక్కడ తినడానికీ ఏమీ లేదు.ఇప్పుడు మీరు మాకు పోటీగా వస్తే ఎలా అనేది వాటి ప్రశ్న.

అలాంటి కోపంలో ఉన్న ఓ మొసలి… కొండచిలువతో యుద్ధానికి దిగింది.

దక్షిణ ఫ్లోరియాలో బర్మా కొండచిలువలకు శాశ్వత నివాసం ఏర్పరిచారు అధికారులు.

తద్వారా వాటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఈ చర్యలు అక్కడి మొసళ్లకు నచ్చట్లేదు.

అక్కడి ఏ ఆహారమైనా తామే తినాలి అన్నది వాటి వాదన.ఈ మొసళ్లు ఎంత డేంజరస్ అంటే.

ఒక్కోసారి ఇవి ఫ్లోరిడా కొండచిలువల్ని కూడా చంపి తింటాయి.బర్మా కొండచిలువలు తక్కువేమీ కాదు.

అవి 20 అడుగుల పొడవు పెరగగలవు.ఇవి కూడా ఆకలేసినప్పుడు దేన్నైనా మింగేస్తాయి.

ఒక్కోసారి మొసళ్లను కూడా మింగుతాయి.ఇలా ఈ రెండూ నువ్వా నేనా అనుకునేటైపు.

వీటి మధ్య యుద్ధం జరిగితే అది బాహుబలి రేంజ్‌లో ఉండటం సహజం.

Telugu Anaconda, Burmese Python, Crocodile, Everglades, Florida, Python, Animals

ఓ పెద్ద మొసలి, పెద్ద కొండచిలువ… నీటిలో ఎదురుపడ్డాయి.అధికార ప్రతిపక్ష పార్టీల నేతల లాగా… ఒకదాన్ని ఒకటి గుర్రుగా చూసుకున్నాయి.మాటల్లేవ్ అనుకుంటూ యుద్ధానికి దిగాయి.

ఫైట్ మామూలుగా జరగలేదు.ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్‌ ఫైట్‌లా జరిగింది.

కొండచిలువను నోట కరచి మొసలి కరకరా కొరకగా… ఆ మొసలిని బలంగా చుట్టుకొని కొండచిలువ… వదిలితేనే వదులుతా అని పంతం పట్టింది.గంటలతరబడి ఈ యుద్ధం సాగింది.

బలంగా చుట్టుకోవడంలో కొండచిలువలకు తిరుగులేదు.ఆ సమయంలో అవి బలం పెంచితే… ఎముకలు విరిగిపోతాయి.అందుకే మొసలికి విషయం అర్థమైంది.తాను చిక్కుల్లో పడుతున్నాను అని గ్రహించిన మొసలి… ఇక ఇక్కడితో ఫైట్ ఆపేయడం మేలు అనుకొని వెనక్కి తగ్గి… తన నోట్లోని కొండ చిలువ బాడీని వదిలేసింది.

దాంతో పైథాన్ కూడా… తగ్గావుగా… తగ్గుతున్నా అని తగ్గింది.

Telugu Anaconda, Burmese Python, Crocodile, Everglades, Florida, Python, Animals

చివర్లో మొసలి కొండచిలువవైపు చూసి గట్టిగా నోరు తెరవగా పైథాన్ మరోసారి మొసలివైపు చూస్తూ ఏంటి రెచ్చిపోతున్నావ్ పట్టు చూశావుగా మళ్లీ పట్టనా నేను పడితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు… పోతావని వార్నింగ్ ఇవ్వడంతో మొసలి వెనక్కి వెళ్లిపోయింది.దాంతో పైథాన్ కూడా వెనక్కి వెళ్లిపోయింది.ఈ వీడియోకి 13 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటేనే ఇది నెటిజన్లకు ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

కెమెరామేన్ ఓపికను మెచ్చుకోవాలి అంటున్నారు.ఇది 2009లో జరిగిన ఘటన.హీకో కీరా దీన్ని వీడియో తీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube