అభిమానులను కలవర పెడుతున్న పుష్ప 2... ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ కాకూడదంటూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం గా రాబోతున్న పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా డిసెంబర్ 6 తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ సినిమా షూటింగ్ పై దృష్టి సారించారు.ఇక ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన వీడియోలు కాని పాటలు కాని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచింది.

ఈ సినిమా పక్క బ్లాక్ పోస్టర్ హిట్ అవుతుందనే ధీమా ప్రతి ఒక్క అభిమానులను ఉంది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా 90% షూటింగ్ పూర్తి అయిందని మరొక రెండు వారాలలో షూటింగ్ పూర్తి చేసేసి గుమ్మడికాయ కొట్టాలనే ఆలోచనలో సుకుమార్( Sukumar ) ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విషయంలో అభిమానులు కొంత కలవర పాటుకు గురి అవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో గుడ్ సెంటిమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ సెలబ్రిటీలను అభిమానులను వెంటాడుతూ ఉంటాయి.అల్లు అర్జున్ కు కూడా పుష్ప 2 విషయంలో ఓ బాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందని అభిమానులు కంగారు పడుతున్నారు.గతంలో సుకుమార్ డైరెక్షన్లో హీరోగా బన్నీ నటించిన ఆర్య సినిమా ఎంతో మంచి సక్సెస్ అయ్యింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చిన ఆర్య 2 అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు దీంతో మరోసారి సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అంటూ కంగారు పడటమే కాకుండా ఈ బాడ్ సెంటిమెంట్ రిపీట్ కాకూడదని కోరుకుంటున్నారు.

'నరుడి బ్రతుకు నటన' అన్నిసినిమాల్లాంటిది కాదు... ఆలోచింపజేసే మూవీ!
Advertisement

తాజా వార్తలు