బన్నీ టూ రొమాంటిక్.. ఎవరూ లేకపోతే భార్యను అలా పిలుస్తారా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్( Allu Arjun )ఒకరు.ఈయన అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Bunny Call Allu Sneha With Nick Name Cutie, Allu Arjun, Allu Sneha,nick Name ,cu-TeluguStop.com

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప సీక్వెల్స్ ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా నెలకొన్నాయి.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం అట్లీ డైరెక్షన్లో చేయబోతున్నారని తెలుస్తుంది.మొత్తానికి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈయన స్నేహారెడ్డిని( Sneha Reddy ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.స్నేహ రెడ్డి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఈమె సోషల్ మీడియా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.స్నేహ రెడ్డి తనకు తన భర్త పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెను సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి.

Telugu Allu Arjun, Allu Sneha, Bunnyallu, Cutie, Nick-Movie

ఇక స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు హీరోయిన్ల రేంజ్ లో డిజైనర్ దుస్తులను ధరిస్తూ పెద్ద ఎత్తున ఫోటో షూట్లను చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో ఉన్నటువంటి రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత పేర్లతో కాకుండా ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు.

Telugu Allu Arjun, Allu Sneha, Bunnyallu, Cutie, Nick-Movie

ఈ క్రమంలోనే  అల్లు అర్జున్ సైతం తన భార్యను ముద్దుగా పిలుస్తారట.మరి అల్లు అర్జున్ తన భార్యను ఏమని పిలుస్తారనే విషయాన్ని వస్తే స్నేహ రెడ్డిని క్యూటీ( Cutie ) అంటూ చాలా క్యూట్ గా పిలుస్తారని తెలుస్తోంది.ఈ విధంగా తన భార్యను ఉద్దేశించి అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు కూడా తనని క్యూటీ అంటూ పిలుస్తూనే పోస్టులు చేస్తుంటారు.

పెళ్లిరోజు కానీ తన పుట్టినరోజు కానీ వస్తే తనని అలాగే విష్ చేస్తూ ఉంటారు.ఇలా తన భార్యను ముద్దుగా క్యూటీ అని పిలుస్తారని తెలిసి బన్నీ చాలా రొమాంటిక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube