కామెడీ హీరోగా మొదటి సినిమా నుండే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పర్చుకున్న హీరో అల్లరి నరేష్( Allari Naresh ) అప్పట్లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎలాగో, నేటి తరానికి కామెడీ హీరో గా అల్లరి నరేష్ అలా పాపులర్ అయ్యాడు.కామెడీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ హీరో ఇప్పుడు వరుసగా సీరియస్ రోల్స్ చేస్తున్నాడు.‘నాంది’ సినిమా నుండి మనం సరికొత్త నరేష్ ని చూస్తున్నాము.ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యి నరేష్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
ఆ సినిమా తర్వాత ‘మారేడుమల్లి నియోజగవర్గం( Itlu Maredumilli Prajaneekam )’ అనే సినిమా తీసాడు కానీ, అది పెద్దగా ఆడలేదు.కానీ అల్లరి నరేష్ కి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘ఉగ్రం( Ugram )’ అనే చిత్రం ద్వారా మన ముందుకి వచ్చాడు.క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిల్చింది.

అయితే ఈ మధ్యనే ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసారు, రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది.చూసిన ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.ఇంత మంచి సినిమాకి నెగటివ్ రివ్యూస్ రాయడానికి మనసు ఎలా వచ్చిందంటూ రివ్యూయర్స్ ని తిడుతున్నారు ప్రేక్షకులు.అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ రేటు కి కొనుగోలు చేసింది.
అయితే వాళ్ళు పెట్టిన డబ్బులు కేవలం మొదటి రోజులోనే ఈ చిత్రం రికవర్ చేసిందని అంటున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమాకి వంద మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట.
ఇది అల్లరి నరేష్ కెరీర్ లో హైయెస్ట్ వ్యూస్ అని చెప్తున్నారు.అంతే కాదు ఆల్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా కొన్ని బాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను కూడా పక్కకి నెట్టి టాప్ 2 స్థానం లో ట్రెండ్ అవుతుందట.

ఈ చిత్రం అల్లరి నరేష్ కి బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద ఉపయోగపడి ఉండకపోవచ్చు కానీ, ఓటీటీ పరంగా మాత్రం బాగా ఉపయోగ పడింది అనే చెప్పాలి.ఈ సినిమా ద్వారా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.ఈ చిత్రం తర్వాత ఆయన సినిమాలకు వాళ్ళు థియేటర్స్ కి కూడా కదలొచ్చు.అంతే కాదు ఈ సినిమా ఎంతో మంది డైరెక్టర్స్ కి అల్లరి నరేష్ ని ఊర మాస్ యాంగిల్ లో వాడుకోవచ్చు అని నిరూపించింది.
ముఖ్యంగా పతాక సన్నివేశం లో అల్లరి నరేష్ చేసే ఫైట్ సీన్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ రేంజ్ మాస్ ఫైట్ ఇప్పటి వరకు కొంతమంది స్టార్ హీరోలకు కూడా పడలేదు అంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
మరి అల్లరి నరేష్ డైరెక్టర్స్ ఇలాంటి సబ్జక్ట్స్ తో భవిష్యత్తులో ముందుకు వస్తారో లేదో చూడాలి.