Sudheer: సుధీర్ హీరోగా వేస్ట్.. మ్యాజిక్ షోలే బెస్ట్.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్?

జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుడిగాలి సుదీర్ ( Sudigali Sudheer ) ఒకరు.ఈయన మ్యాజిక్ షోలను చేసుకుంటూ జీవనం గడిపే సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చే అనంతరం టీం లీడర్ గా మారిపోయారు.

 Bullet Bhaskar Setires On Sudigali Sudheer-TeluguStop.com

ఇక ఈయన అంచలంచలగా ఎదుగుతూ నేడు సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.  ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి సుధీర్ పై తాజాగా కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ( Bullet Bhaskar ) చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

Telugu Bhaskar, Bulletbhaskar, Jabardasth, Sudheer, Tolly Wood-Movie

ఇటీవల జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా సుడిగాలి సుదీర్ పై విమర్శలు చేశారు.అసలే పెళ్లిళ్ల సీజన్ వస్తుంది వాడికి మ్యాజిక్ షోలు చేసుకోరా అని చాలా బుద్ధిగా చెప్పాను కానీ నా మాట వినడం లేదు అంటూ కామెంట్లు చేశారు.అంతేకాకుండా ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన విమర్శలు పట్ల సుధీర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఆయన హీరోగా మంచిగా కొనసాగుతున్నారు కదా సార్ అంటూ తన అసిస్టెంట్ అనడంతో ఏం సక్సెస్ అయ్యారు.

కాలింగ్ సహస్ర కాలింగ్ బెల్ కొట్టినంత సేపు కూడా లేదని కామెంట్లు చేశారు.

Telugu Bhaskar, Bulletbhaskar, Jabardasth, Sudheer, Tolly Wood-Movie

ఇక త్రీ మంకీస్ చెడు వినకు, చూడకు, మాట్లాడకు అనేలా ఆ సినిమా ఉంది అంటూ సెటైర్లు వేశారు.ఇక సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాని సాఫ్ట్వేర్ కంపెనీలో కాస్త ఊడ్చే వాళ్లు కూడా చూడలేదని బుల్లెట్ భాస్కర్ సుదీర్ ను దారుణంగా అవమానించారు.ఇక గాలోడు సినిమా సక్సెస్ అయింది కదా సార్ అంటూ భాస్కర్ అసిస్టెంట్ మాట్లాడటంతో ఫ్యాన్ గాలి వేసి గాలి వచ్చేలోపు థియేటర్ నుంచి మాయమైంది అంటూ సుధీర్ సినిమాలపై దారుణమైనటువంటి కామెంట్లు చేశారు.

ఈ వ్యాఖ్యలపై సుదీర్ ఫాన్స్ స్పందిస్తూ సుదీర్ పట్ల కామెంట్లు చేయడం పక్కన పెడితే ఆయన సినిమాల గురించి ఇలా దారుణమైనటువంటి కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ బుల్లెట్ భాస్కర్ వ్యవహార శైలి పై మండిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube