జబర్దస్త్ షో టి.ఆర్.
పి రేటింగ్ పెంచడానికి మల్లె మాట టీం తెగ కష్టపడుతుంది.అయితే రోజు రోజుకి షోలో మళ్లీ రోత ఎక్కువవుతుందని చెప్పొచ్చు.
లేడీ గెటప్ లతో ఇప్పటికే చాలామంది ఆడియన్స్ కి ఎంటర్టైన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.వారు చాలదు అన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా బుల్లెట్ భాస్కర్ తండ్రిని కూడా రంగంలోకి దించారు.
ఫెస్టివల్ టైం లో భాస్కర్ తండ్రి షోలో పాల్గొనగా అతని టైమింగ్ బాగుందని జబర్దస్త్ లో రోహిణి టీం లో అతన్ని కొనసాగిస్తున్నారు.
చేసేది రోహిణి టీం అయినా కూడా భాస్కర్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇక లేటెస్ట్ ప్రోమోలో భాస్కర్ తండ్రి అప్పారావు చేత లేడీ గెటప్ వేయించారు.ఇప్పటికే మేల్ కమెడియన్స్ లేడీ గెటప్స్ వేసుకుంటుంటే రోత పుడుతుందని కామెంట్స్ చేస్తుంటే ఇది చాలదు అన్నట్టుగా ఇప్పుడు వయసు మల్లిన భాస్కర్ తండ్రి అప్పారావు చేత కూడా లేడీ గెటప్ వేయించి షో మీద ఉన్న ఆ కాస్త ఇంట్రెస్ట్ కూడా పోయేలా చేస్తున్నారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి భాస్కర్ ఫాదర్ అప్పారావు చేత కూడా గెటప్ వేయించిన జబర్దస్త్ షో మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.