ఆ ఊరిలో బైక్ ను పూజిస్తున్న జనం.. ఎందుకంటే ?

ఎవరైనా దేవుడిని పూజించడం చేస్తూ ఉంటారు.కానీ వాహనాలను దేవుడిలాగా పూజించడం ఎప్పుడైనా చూసారా.

బహుశా చూసి ఉండరు.ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరు ఒక బైక్ ను దేవుడి లాగా పూజించి ఉండరు.

కానీ ఒక ఊరిలో ప్రజలు మాత్రం దేవుడిలాగా బైక్ ను పూజిస్తూ ఉన్నారు.ఆ బుల్లెట్ ను పూజిస్తూ పూల మాలలు వేసి దేవుడిని పూజించినట్టు పూజిస్తున్నారు.

రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఉన్న ప్రజలు ఇలా బుల్లెట్ ను పూజిస్తూ ఉన్నారు.అంతేకాదు ప్రత్యేకంగా ఆలయం కూడా ఉంది.

Advertisement
Story Behind Bullet Baba Temple In Rajasthan Jodhpur, Om Banna Temple, Jodhpur,

ఓం బన్నా.బుల్లెట్ బాబా అనే పేరుతొ ఈ ఆలయం ఉంది.

ఈ ఆలయంలో 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ కు అక్కడి ప్రజలు ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటారు.ఈ ఆలయం జోధ్ పూర్ కు 47 కిలో మీటర్ల దూరంలో పాలీ జాతీయ రహదారి పక్కన ఉంది.

ఈ బుల్లెట్ ను పూజించడం వెనుక ఒక పెద్ద కథ ఉందని స్థానికులు చెబుతున్నారు.

Story Behind Bullet Baba Temple In Rajasthan Jodhpur, Om Banna Temple, Jodhpur,

ఆ కథ ఏంటంటే.ఓం బన్నా అనే వ్యక్తి 1988 డిసెంబర్ 2 న ఆ రాయల్ ఎన్ ఫీల్డ్ మీద వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదం తర్వాత పోలీసులు ఆ బుల్లెట్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

ఇక్కడే ఒక వింత సంఘటన జరిగింది.ఆ సంఘటన అందరిని ఆశ్చర్య పరిచింది.

Advertisement

ఏం జరిగిందంటే.పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఆ బుల్లెట్ మరుసటి రోజు అక్కడ కనిపించలేదట.

అంత వెతుకగా మళ్ళీ ప్రమాదం జరిగిన చోటులోనే ఆ బుల్లెట్ కనిపించింది.పోలీసులు అది ఎవరో కావాలని చేసి ఉంటారని అనుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి అందులో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేసారు.

మళ్ళీ మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి.దీంతో ఆ పోలీసులు ఆ బులెట్ ను అక్కడే వదిలేసారు.చనిపోయిన ఓం బన్నా వ్యక్తి ఆత్మే ఇదంతా చేసిందని భావించి అప్పటి నుండి ఆ బుల్లెట్ కు పూజలు చేయడం ప్రారంభించారు.

ఆ బైక్ కోసం ప్రత్యేకంగా ఆలయం కూడా నిర్మించి పూజలు చేస్తున్నారు.ఆ రహదారి గుండా వెళ్లే వాళ్ళు తప్పకుండ ఆ ఆలయాన్ని దర్శించుకుని వెళ్తారు.అలా చేయకపోతే వాళ్లకు ప్రమాదం వాటిల్లుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

https://youtu.be/WPQQYPXlTPI

తాజా వార్తలు