ఇపుడు స్మార్ట్‌ఫోన్ ( Smartphone ) లేనిదే బయటకు కాలుపెట్టలేని పరిస్థితి.కమ్యూనికేషన్స్ నుంచి పేమెంట్స్ వరకు ఇపుడు స్మార్ట్‌ఫోన్లోనే పనంతా అయిపోతోంది.
ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ లేనివారు సైతం బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల కోసం వెతుకుతున్న పరిస్థితి.అందుకోసమే కంపెనీలు సైతం హై -ఎండ్ ఫీచర్స్‌తో సాధారణ ధరలకే లభ్యమయ్యే డివైజ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.అందుకే మార్కెట్‌లో బెస్ట్ ఫీచర్స్‌తో రూ.15వేలల్లో లభిస్తున్న 5జీ, 4జీ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇక్కడ చూద్దాముపై.

ముందుగా ఇక్కడ ‘మోటోరోలా G13’( Moto G13 ) స్మార్ట్‌ఫోన్ గురించి చూద్దాము.ఇది పదివేలలోపే మీకు లభ్యమౌతుంది.అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్స్ దీని సొంతం.ఇది 2 వేరియంట్స్‌తో మార్కెట్లో కలదు.ఒక వేరియంట్ రూ.9,499కు, వేరొక వేరియంట్‌ను రూ.9,999కు సొంతం చేసుకోవచ్చు.ఈ లిస్టులో రెండవది ‘రియల్‌మీ 10 4G.’( Realme 10 4G ) దీనిని మీరు రూ.13,999కు సొంతం చేసుకోవచ్చు.ఇది 1080p రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.3వది చూసుకుంటే ‘శామ్‌సంగ్ గెలాక్సీ F14 5G’( Samsung Galaxy F14 5G ) స్మార్ట్‌ఫోన్ ఇపుడు రూ.14,490కు అందుబాటులో వుంది.అద్భుతమైన ఫీచర్లు దీని సొంతం.

ఈ లిస్టులో నాల్గవది ‘రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్.’ ఈ వేరియంట్ ప్రస్తుతం రూ.14,999కు మీకు లభిస్తుంది.పదిహేనువేలు లోపు పెట్టగలిగేవారికి ఇదొక మంచి ఆప్షన్.దీనిలో 50 MP + 8 MP + 2 MPతో కూడిన రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఇంకా 13 MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్స్ కలవు.
ఇక చివరగా ‘రియల్‌మీ C55’ గురించి ఇక్కడ చెప్పుకోవాలి.ఈ స్మార్ట్‌ఫోన్ 3 వేరియంట్లలో కలదు.రూ.11,999 నుండి ధర రూ.13,999 కలదు.మీకు నచ్చిన వేరియంట్ కారణంగా ధర అనేది కాస్త పెరుగుతూ ఉంటుంది.
పూర్తి సమాచారం కొరకు సంబంధిత వెబ్ సైట్స్ సందర్శించగలరు.







