విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ను చాలా తేలిగ్గా డీజీపీ చెప్పడం పట్ల సెల్యూట్ చేస్తున్నా ..బుద్ధా వెంకన్న

విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ను చాలా తేలిగ్గా డీజీపీ చెప్పడం పట్ల సెల్యూట్ చేస్తున్నా అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధా వెంకన్న ( TDP Leader Budda Venkanna) అన్నారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ… కాకతాళీయంగా జరిగినట్టు డీజీపీ ( AP DGP ) చెప్పడం హాస్యాస్పదమన్నారు.

 Buddha Venkanna Salutes The Dgp For Making Visakha Mp's Family Kidnapping So Eas-TeluguStop.com

భూదంధాల గురించి ఆరు నెలల ముందే తాను చెప్పింది ఇవాళ జరిగిందన్నారు.రేపు సాయిరెడ్డి కిడ్నాప్ కూడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

భూదందాల వాటాలలో తేడానే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ డ్రామా అని అన్నారు.ఎంపీకి ఇబ్బంది కలిగితే డీజీపీ కూడా వెళ్ళాలని.

కానీ వెళ్ళలేదన్నారు.డీపీపీ ఆఫీసులో కూర్చుని రౌడీషీటర్లు చేశారని మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు.

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌కు వివేకా హత్యకు పోలికలున్నాయన్నారు.ఉత్తరాంధ్ర ఇంఛార్జ్‌గా విశాఖ వెళ్లి ఎంపీ సత్యనారాయణ కుటుంబాన్ని కలువనున్నట్లు తెలిపారు.

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.

కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ.

.

మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani ) నిన్న సభలో చెప్పినవన్నీ అబద్ధాలే అని అన్నారు.కొడాలి నాని బ్రతుకే లాలూచీ బ్రతుకని విమర్శించారు.రాజశేఖర్‌రెడ్డి వేసిన శిలాఫలకాన్ని పగులకొట్టావని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.కొడాలి నాని గడ్డి, అన్నం కాకుండా గుట్కాలు తింటాడన్నారు.గుడివాడలో భూముల కొనుగోలులో కొడాలి నాని పెద్ద కుంభకోణం చేశారని ఆరోపించారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.ఓడిపోయినా పవన్, లోకేష్ ప్రజల మధ్య ఉన్నారన్నారు.నల్లబెలూన్లు వదిలిన మహిళలను అరెస్టు చేసి మహిళా పక్షపాతి అంటే ఎలా అని నిలదీశారు.2005లో రాజశేఖర్‌రెడ్డి కొడాలి నానికి ఉపయోగపడితే.2009లో చంద్రబాబును టికెట్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు.నిజం మాట్లాడితే తల పగులుతుందనే శాపం ఉందేమో కొడాలి నానికి అంటూ బుద్దా వెంకన్న యెద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube