ఇంత దారుణమా.. తల్లిని చంపి మద్యం తాగుతూ ఎంజాయ్ చేసిన తనయుడు..!

మానవత్వం అనేది బయటి సమాజంలో ఏమో కానీ, కుటుంబంలోని సభ్యుల మధ్యనే అంతరించిపోయే దశలో ఉంది.చెడు వ్యసనాల వల్ల రోజు రోజుకు దారుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

 Brutal Son Kills Mother For Money,chennai,murder,son,mother,liquor,dinesh,police-TeluguStop.com

ఈ మధ్య జరిగే దారుణాలకు కారణం ఎక్కువగా అక్రమ సంబంధాలు అయితే, తర్వాత జరిగే దారుణాలలో చెడు వ్యసనాలైన మద్యం, డ్రగ్స్( Liquor ) లు ప్రధాన కారణం.సమాజంలోని వ్యక్తులు మోసం చేసి ప్రాణాలతో వదిలేస్తే, కుటుంబంలోని సభ్యులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.

చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఒక యువకుడు, డబ్బుల కోసం నవమాసాలు కని పెంచిన కన్నతల్లినే అతి కిరాతకంగా చంపి, తల్లి మృతదేహం పక్కనే మద్యం తాగుతూ ఎంజాయ్ చేశాడు.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

Telugu Chennai, Dinesh, Liquor, Mother, Complaint-Latest News - Telugu

చెన్నై( Chennai )లోని చక్రమల్లూరు కు చెందిన వాణీశ్వరి, రాహులన్ దంపతులకు రాజేష్, దినేష్, ప్రియా అనే ముగ్గురు పిల్లలు సంతానం.కొంత కాలం క్రితం రాహులన్ మృతి చెందాడు.రాజేష్, దినేష్ లు వేలూరు లో పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు.అయితే దినేష్ మద్యానికి అలవాటు పడి, విధులకు సరిగా హాజరు కాకపోవడంతో ఈమధ్యనే డిస్మిస్ అయ్యాడు.

దినేష్ భార్య తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది.చక్ర మల్లూరు లో దినేష్ తన తల్లితో పాటు ఉంటూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు.

ఈ క్రమంలోనే ఈనెల 13న మద్యం తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవ పెరిగి పక్కనే ఉన్న కర్రతో బలంగా కొట్టడంతో తలకు గాయం అయి రక్తపు మడుగులోకి జారుకుని ప్రాణాలు విడిచింది.

Telugu Chennai, Dinesh, Liquor, Mother, Complaint-Latest News - Telugu

ఈ విషయం బయటకు తెలియకుండా ఇంటికి తాళం వేసి తల్లి మృతదేహం( Mother Dead body ) పక్కనే మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేయసాగాడు.ఇంట్లో నుండి బయటికి రాకపోవడం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు( Police ) ఇంటి తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళితే వాణీశ్వరి రక్తపు మడుగులో పడి ఉంది.

పోలీసులను గమనించిన దినేష్ వెంటనే అక్కడికి నుండి పారిపోయాడు.వాణీశ్వరి కూతురు ప్రియా ఇచ్చిన ఫిర్యాదు తో దినేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube