సంగారెడ్డి( Sangareddy ) లోని గుమ్మడిదల మండలంలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం వెలుగు చూసింది.మంగళవారం రాత్రి నల్లబెల్లి అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు చెట్ల పొదల్లో ఓ మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన మూడవత్ శివ నాయక్, మంగమ్మ భార్యాభర్తలు.వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
ఈ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్ లోని బాలానగర్ సమీపంలో నివాసం ఉంటూ, శివ నాయక్ డ్రైవర్ గా, మంగమ్మ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు.
అక్టోబర్ 28న కూలి పని కోసం బయటకు వెళ్లిన మంగమ్మ తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు.దీంతో ఆమె భర్త శివ నాయక్ తన భార్య అదృశ్యం అయిందని బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు( Police ) కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
మంగళవారం రాత్రి ఫారెస్ట్ అధికారులకు ఓ వివాహిత మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు శివనాయక్ ను పిలిపించి ఆ మహిళ మృతదేహం ఒక్కసారి చూడాలని సూచించారు.ఆ తర్వాత మృతదేహాన్ని పరిశీలించిన శివ నాయక్ ఆమె తన భార్య అని గుర్తుపట్టాడు.
మృతదేహాన్ని పోలీసులు పరిశీలించగా.ఐదు రోజుల క్రితం మంగమ్మ హత్యకు గురైందని, సత్య అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
దాదాపుగా ఐదు రోజులు కావడంతో మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉందని, హత్య కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.