మంచిర్యాల జిల్లాలో దారుణ హత్య జరిగింది.ఇందారంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి, కత్తులతో పొడిచి అతి కిరాతకంగా చంపారు.
గత కొన్ని నెలలుగా మహేశ్ అనే యువకుడు ఓ వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో వివాహిత బంధువులే యువకుడిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.