రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి.ఆస్తి తగాదాలు, కిడ్నాపులు, హత్యలు వంటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
సమాజాంలో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు హత్యకు గురవుతున్నారు.తెలుగు రాష్ట్రాలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
కరోనా టైంలో దాదాపుగా ప్రమాదాలు అనేవి తగ్గాయి.అయితే వేధింపులు, కుటుంబ తగాదాలు అనేవి పెరిగాయి.
చాలా మంది ఇళ్లల్లోనే ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఇళ్లలో ఉండటం వల్ల ద్వేషాలు, అనుమానాలు, చిన్నచూపు చూడటం వంటివి మనుషుల మధ్య కలుగుతున్నాయి.
ఇటువంటి సమయంలోనే దారుణాలు జరుగుతున్నాయి.పగలు, ప్రతీకారాలు ఎక్కువైపోతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.తన అక్కను చంపేశాడనే కసితో బావను కత్తితో పొడిచాడు.
నడిరోడ్డుపైనే ప్రజలంతా చూస్తుండగా బావను కింద పడేసి కత్తితో బావమరిది పొడిచాడు.జనగాం జిల్లా కేంద్రంలో ఈ ఘటన కలకలం రేపింది.
ఐదేళ్లుగా బావ మీద పగ తీర్చుకోవాలని బావమరిది అనుకుంటూ ఉన్నాడు.అయితే సమయం కోసం ఎదురుచూశాడు.
చివరికి ప్రజలంతా చూస్తుండగానే ఆ యువకుడు చంపేందుకు ప్రయత్నించాడు.
చాలా మంది మర్డర్ అంటే భయపడతారు.
సినిమాలో లాగా పారిపోతారు.అయితే జనగామలో మాత్రం అలా జరగలేదు.
కళ్ల ముందే ఘోరం జరుగుతుంటే జనగామ ప్రజలు కత్తితో పొడుస్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.బాధితుడిని నాలుగు చితకబాది పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రక్తం మడుగులో ఉన్నటువంటి బాధితున్ని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు.పోలీసులు విచారణ చేశారు.బాధితుడు నర్మెట మండలం ఇప్పులగడ్డ తండాకు చెందిన బానోతు చంద్రశేఖర్ గా తెలుసుకున్నారు.హత్య చేయడానికి ప్రయత్నించిన యువకుడు కాజీపేటకు చెందిన ధరావత్ రమేష్ గా పోలీసులు నిర్దారించారు.
ఐదు ఏళ్ల క్రితం తన అక్క సరితను హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన బావ బానోతు చంద్రశేఖర్ ఇలా బావ హత్యకు స్కెచ్ వేసి కత్తితో చంపాలని చూశాడని తెలిపారు.