హేమమాలినిది ఘోరమైన తప్పు

మాజీ హీరోయిన్‌, ప్రస్తుత భాజపా ఎంపీ హేమమాలిని వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.ఆమె ఆ వ్యాఖ్యలు చేసివుండకూడదని సొంత పార్టీ వారే అభిప్రాయపడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం రాజస్థాన్‌లో ఆమె కారు-మరో కారు ఢీకొనడం, ఈ ప్రమాదంలో హేమ తీవ్రంగా గాయపడటం, అవతలి కారులోని మూడేళ్ల చిన్నారి చనిపోవడం, ఆ పాప తండ్రితో సహా ఆ కారులోని మరి కొందరు గాయపడటం.ఇదంతా తెలిసిందే.

తన తల్లి కోలుకున్న తరువాత చనిపోయిన పాప కుటుంబానికి తగినంత సాయం అందచేస్తారని, ఆమె మానవత్వం గల మహిళ అని హేమ కూతురు ఈషా డియోల్‌ కూడా మీడియాకు చెప్పింది.అయితే తాజాగా ఈ మాజీ హీరోయిన్‌ పాప చనిపోవడానికి ఆమె తండ్రే కారణం.

అతను ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడిపాడు అని ట్విట్టర్లో ట్వీట్‌ చేసింది.ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.

Advertisement

హేమ ఇలా వ్యాఖ్యానించడానికి కారణం ఏమిటంటే.హేమమాలిని నా పాపను ఆస్పత్రికి తీసుకుపోయుంటే ఆమె బతికేది అని తండ్రి హర్ష ఖండేల్‌వాలా అనడంతో హేమకు కోపం వచ్చింది.

దీంతో తప్పంతా అతనిదేనన్నట్లుగా మాట్లాడింది.ఈ ప్రమాదంలో చిన్న పాప చనిపోవడంతో ప్రజల సానుభూతి ఆమె తండ్రి పైనే ఉంది.

ఈ దశలో హేమ ఈ వ్యాఖ్య చేశారు.అందులోనూ ప్రస్తుతం పాలక భాజపా పరిస్థితి దుర్భరంగా ఉంది.

అనేక కుంభకోణాలు చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.హేమ పాలక పార్టీ ఎంపీ కావడంతో ఆమె వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

హేమ వ్యాఖ్యలను ఉద్దేశించి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో మేమమాలిని ఘోరమైన తప్పు చేశారు అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.ప్రమాదం జరగ్గానే హేమ చిన్న పాపను వదిలేసి వచ్చారని, ఇది దారుణమైన తప్పిదమని, ముందుగా దీన్ని ఆమె అంగీకరించాలని మంత్రి అన్నారు.

Advertisement

ప్రమాదం జరగ్గానే హేమను ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, ఖండేల్‌వాలా కుటుంబాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అక్కడ పాప చనిపోయింది.

హేమకు నుదిటి మీద దెబ్బలు తగిలాయిగాని ఆమె ప్రాణాపాయ స్థితిలో లేదు.ఆ సమయంలో ఆమె తనతో పాటు పాపను కూడా ఆస్పత్రికి తీసుకుపోయుంటే ఆమె మానవత్వాన్ని చాటుకున్న వ్యక్తిగా ప్రశంసలు పొందే పొందేది.

తాజా వార్తలు