కర్ణాటకలో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఎంత?

దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల( Karnataka Assembly Elections ) వైపు ఆసక్తిగా చూస్తున్న విషయం తెలిసిందే.గత ఎన్నికల సమయం లో బిజెపి ( BJP )కి మ్యాజిక్ నెంబర్ దక్కకుండా కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేల సహాయం తో అధికారానికి చేరువైన విషయం తెలిసిందే ఈ సారి బిజెపి సొంత బలం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల్లో గెలుపొందాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ మరియు జెడిఎస్ పార్టీలు బిజెపిని అధికారం నుండి దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అక్కడ ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.వచ్చే సంవత్సరం జరగబోతున్న పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని పోటీకి నిలిపి ఏకంగా ప్రధాని పీఠం పై కూర్చుంటానంటూ కేసీఆర్ ( KCR )చాలా ధీమా తో ఉన్నారు.

అలాంటి కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నారు.ఈసారి పార్టీ అక్కడ పోటీ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాలి అంటే ఒకే సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే సరిపోదు ముందస్తుగా ఇలాంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా పోటీ చేసి సత్తా చాటాల్సి ఉంటుంది.

కేసీఆర్ వ్యూహం ఏంటో ఆయన రాజకీయ ఎత్తుగడలు ఏంటో ఆయనకే తెలియాలి.కర్ణాటక లో జెడిఎస్ కి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.

Advertisement

ఆ విషయమై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కర్ణాటకలో కేవలం ప్రచారం వరకే పరిమితం కాబోతున్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే కన్నడ అసెంబ్లీ ఎన్నికలలోనైనా పోటీ చేస్తుందేమో చూడాలి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు