ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఐదో రోజు కస్టడీలోకి తీసుకుంది.ఈ మేరకు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత( BRS MLC Kavitha ) పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.రూ.100 కోట్ల ముడుపులతో పాటు సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.దాంతోపాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఒప్పందాలపై ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
అలాగే ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.నిన్న కవిత పీఏలు రాజేశ్, రోహిత్ ను ప్రశ్నించిన ఈడీ ఆమె అరెస్ట్ అయిన సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై కూడా ప్రశ్నించరాని సమాచారం.మరోవైపు ఇవాళ కవితను కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.