బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.ఈ క్రమంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి కావేరి ఎదుట సీబీఐ అధికారులు( CBI Officials ) హాజరుపర్చనున్నారు.
లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ కోర్టుకు వివరించనుంది.కవిత కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీ( Judicial Custody )కి పంపాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది.
మరోవైపు కవితను బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.ఈ క్రమంలో కవితకు న్యాయస్థానం కస్టడీ పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.