తెలంగాణ రాజకీయాలు నీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి.ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్ళు ఎలా ఎత్తిపోస్తారో.? బీఆర్ఎస్ చెప్పాలని.కావాలంటే పెత్తనం వాళ్ళకే ఇస్తామని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు స్పందించారు.తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
వాళ్లకు చేతకాకపోతే దిగిపోమనండి.రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనండి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.ఎత్తిపోతలు చేసి చూపిస్తానంటూ హరీష్ రావు స్పష్టం చేశారు.

బుధవారం తెలంగాణ భవన్( Telangana Bhavan ) లో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా కాంగ్రెస్( Congress ) హయాంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే మా హయాంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నులు వడ్లు పండినాయ్.మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దానిమీద బురద జల్లాలి.ఏదో రకంగా చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు.
కానీ నిజం నిలకడ మీద తెలుస్తది.

మేము రిజర్వాయర్లు నింపి పెట్టినం గనుక యాసంగికి నీళ్ళు అందుతున్నాయి.వచ్చే ఏడాది ఇదే సమయానికి యాసంగికి నీళ్లు రాలేదనుకో కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చాయ్.ఇప్పుడు ఎందుకు రాలేదు అని ప్రజలు ఆలోచించరా అంటూ హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదే సమయంలో పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు.ఎవరు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు.
ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి.మీరు బాగా చేస్తే ఆదరిస్తారు.
లేదంటే బండకేసి కొడతారు అని హరీష్ రావు( Harish Rao ) వ్యాఖ్యానించారు.