తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏపీలోని వైసిపి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.కానీ గతంలో వైసీపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చిన నేతలు ఒక్కసారిగా తమ స్టాండ్ మార్చుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉందట.
ఏపీలో చీకట్లు తెలంగాణలో వెలుగు జిలుగులు … ఏపీలో సింగిల్ రోడ్లు తెలంగాణలో డబుల్ రోడ్లు అంటూ సీఎం కేసీఆర్( CM KCR ) సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ మంత్రి హరీష్ రావు తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఏపీ ప్రభుత్వం పైన , అక్కడ ప్రభుత్వ విధానాలపైన అనేక విమర్శలు చేశారు.

తాజాగా కేసిఆర్ కూడా ఇదే రకంగా విమర్శలు చేయడం తో వైసిపి( YCP ) డిఫెన్స్ లో పడింది .అయితే కేసీఆర్ జగన్ కు మధ్య ఉన్న అనుబంధం దృష్ట్యా, ఆ పార్టీ పైన కేసీఆర్ పైన విమర్శలు చేసేందుకు వైసిపి నేతలు ఆసక్తి చూపించడం లేదు.పూర్తిగా చంద్రబాబు అరెస్టు , టిడిపి నాయకుల పై విమర్శలు చేసేందుకు వైసిపి నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో, టిడిపి( TDP ) అనేక విమర్శలు చేస్తోంది. పక్క రాష్ట్రాల నాయకులు కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అంత అద్వానంగా ఏపీ ప్రభుత్వ పాలన ఉంది అంటూ మండిపడుతున్నారు.
అయినా వైసీపీ మాత్రం బీఆర్ఎస్ నాయకుల పైన, కెసిఆర్ పైన విమర్శించే సాహసం చేయడం లేదు.కొద్దిరోజుల క్రితం వరకు మంత్రి హరీష్ రావు , ఏపీ ఉద్యోగుల పరిస్థితిపై సెటైర్లు వేస్తే వెంటనే మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని( MLA perni Nani ) వంటి వారు హరీష్ రావు విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు.

కానీ ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ఏపీలో రోడ్లు కరెంటు కష్టాలను ప్రస్తావించినా వైసిపి మాత్రం కేసీఆర్ ను విమర్శించే సాహసం చేయడం లేదు.అయితే ఒక్కసారిగా ఈ తరహా కామెంట్లు బీ ఆర్ ఎస్ ఉదృతం చేయడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి .చంద్రబాబు( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన నేపథ్యంలో తెలంగాణలో టిడిపి నాయకులు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేశారు అయితే ఆందోళనలు, సంఘీభావ కార్యక్రమాల ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్( KTR ) తో పాటు , బీఆర్ఎస్ నాయకులు కొంతమంది విమర్శలు చేయడం, ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ముడుపెట్ట వద్దని , ఆయన అక్కడ అరెస్టు జరిగితే ఇక్కడ ఆందోళనలు ఏమిటని ప్రశ్నించడం తదితర కారణాలు బీ ఆర్ ఎస్ పై టిడిపి సానుభూతిపరులు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అలెర్ట్ అయ్యింది.నియోజకవర్గాల్లో టిడిపి ఓటు బ్యాంకు కీలక కావడంతో వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆ ఓటు బ్యాంకు డిఆర్ఎస్ వైపుకు డైవర్ట్ అవుతుందనే అంచనాతో ఈ విధంగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని సెటైర్లు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
అయినా ఆ విమర్శలను పట్టించుకోనట్టుగానే వైసిపి వ్యవహరిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.







