బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ 51 మంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్ అందించారు.హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సమావేశం అయ్యారు.
ఈ క్రమంలోనే 51 మందికి బీ -ఫామ్స్ అందించిన కేసీఆర్ మిగతా అభ్యర్థులకు రేపు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.అయితే ఈ వ్యవహారంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టెక్నికల్, న్యాయపరమైన సమస్యల వలన 51 మందికే బీఫామ్స్ ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పినప్పటికీ బీ ఫామ్స్ పొందని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అభ్యర్థులను మార్చుతున్నట్లు కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలుస్తోంది.
దీంతో ఇవాళ బీ-ఫామ్స్ రాని అభ్యర్థులు తమకు బీఫామ్స్ వస్తాయా? రావా? అనే ఆందోళనలో ఉన్నారు.మరోవైపు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్.
ఈ క్రమంలో బీ ఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు 98480 23175కి కాల్ చేసి.న్యాయపరమైన అనుమానాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు.







