గాలి లో ఉన్న పక్షి కోసం ఆశపడి చేతి లో ఉన్న పక్షి ని బి ఆర్ ఎస్( BRS ) దూరం చేసుకుంటుందా ? ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ముఖ్యంగా తెలంగాణలో తమ అభివృద్ధిని ప్రచారం చేసుకోవడానికి, తమ గొప్పతనాన్ని వివరించడానికి నమూనాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనను పోల్చి చూపిస్తున్న బి ఆర్ఎస్ పెద్దలు అందుకు భారీ మూల్యాన్ని చెల్లించబోతున్నారని వైసిపి వర్గాలు( YCP ) అంటున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రాలోని మౌలిక సదుపాయాలు, రోడ్లు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ తమ పరిపాలనా సామర్ధ్యం చూపించుకోవడం కోసం జగన్ పరిపాలన విమర్శించడం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని కేసీఆర్ కు( KCR ) దూరం చేస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా తెలంగాణలో పెద్ద మొత్తంలో సెటిల్ అయిన తెలుగుదేశం( TDP ) అనుకూల సామాజిక వర్గం ఓటు బ్యాంకు కోసం జగన్ కి( Jagan ) వ్యతిరేకమైన స్టేట్మెంట్లను బి ఆర్ఎస్ మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఇస్తూ ఉండటంతో ఇప్పుడు తెలంగాణలో సమీకరణాలు మారుతున్నాయి అన్న వాదన వినిపిస్తుంది.ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ భారీ ఎత్తున చంద్రబాబుకు( Chandrababu Naidu ) మద్దతు తెలుపు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో తాము కూడా బాబు అనుకూల వైఖరి తీసుకుంటే మంచిదన్న కోణంలో బిఆర్ఎస్ అధిష్టానం ఉందని, అందుకే బాబు అనుకూల వాయిస్ ను వినిపించడానికి ప్రయత్నించి సెటిలర్ ల ఓట్లను కొల్లగొట్టాలని బి ఆర్ఎస్ ప్లాన్ చేసిందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి, అయితే బి ఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసినా ఆ సామాజిక వర్గం కాంగ్రెస్కే మద్దతుగా నిలబడుతుందని,
ఎందుకంటే కేసీఆర్ మరోసారి అదికారం లోకి వస్తే జగన్ కు సాయం చేస్తాడు అన్న అనుమానం ఇప్పటికీ ఆ సామాజిక వర్గంలో ఉందని అలాంటి వర్గాల ఓట్ల కోసం ఇలాంటి ప్రకటనలు ఇస్తే ఇప్పటివరకూ అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ( Reddy Community ) కూడా కేసీఆర్ కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వాదిస్తుంది .అయితే పోలింగ్ రోజు దగ్గర పడుతున్నా కూడా తెలంగాణలో మొగ్గు ఏ పార్టీ వైపు ఉంది అన్నది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మధ్య హోరోహోరీ పోరు నడుస్తూ ఉండడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్న తొందరలో పార్టీలన్నీ రకరకాల సమీకరణాలను ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి బిఆర్ఎస్ తీసుకున్న ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందా అన్నది వేచి చూడాలి
.